VK Paul : 2022 ఏడాదిలోనూ మాస్క్ ధరించడం మానొద్దు!

కరోనా ఇంకా పోలేదు. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి తగ్గింది అంతే.. కరోనా కేసులు తగ్గిపోయి.. ఇంకా మాస్క్ లతో పనేంటి? అనుకుంటే పొరపాటే..

VK Paul : 2022 ఏడాదిలోనూ మాస్క్ ధరించడం మానొద్దు!

Masks Will Stay Through 2022, Need Drug Against Covid

Masks Will Stay Through 2022, Need Drug Against Covid : కరోనా ఇంకా పోలేదు. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి తగ్గింది అంతే.. కరోనా కేసులు తగ్గిపోయి.. ఇంకా మాస్క్ లతో పనేంటి? అనుకుంటే పొరపాటే.. సరిగ్గా ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. కరోనావైరస్ బారిన పడకుండా ఉండాలంటే 2022 ఏడాదిలోనూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సిందేనని ఆయన అన్నారు. కరోనాపై పోరాటానికి సమర్థవంతమైన వ్యాక్సిన్లు, ఔషధాలు, కాంబినేషన్ వ్యాక్సిన్లపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు.
Sam-Chay : ఒక్క ట్వీట్‌తో పుకార్లకు నాగచైతన్య చెక్…! నెటిజన్ల ఎమోషన్ చూశారా..?

అంతేకాదు.. సామాజిక క్రమశిక్షణతో ప్రతిఒక్కరూ మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. టీకాలు, ఔషధాలతో ప్రపంచం వైరస్ నుంచి బయటపడే రోజులు రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. సెకండ్ వేవ్ తర్వాత కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు రాదని కొట్టిపారేయలేమని వీకే పాల్ పేర్కొన్నారు. దేశం కరోనా మూడో ముప్పు దశలోకి ప్రవేశిస్తోందని హెచ్చరించారు. ప్రత్యేకించి పండగల సీజన్ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. మరో ఏడాది వరకూ మాస్క్ ధరించడం మానొద్దని సూచించారు. కరోనాను నిరోధించే సమర్ధవంతమైన డ్రగ్స్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు ఈ నెలాఖరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం లభించే అవకాశం ఉందని వీకే పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా? అంటే.. థర్డ్ వేవ్ ముప్పును కొట్టిపారేయలేమన్నారు. రాబోయే మూడు నాలుగు నెలల్లలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాల్సి ఉందని, తద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ పెంచుకోవాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా క్రమశిక్షణతో మహమ్మారిను అడ్డుకోవాలని, అప్పుడే వైరస్ నిర్మలన సాధ్యపడుతుందని చెప్పారు. దసరా, దీపావళి పండగ సీజన్‌లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Manchu Manoj : చిన్నారి ఘటనపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్..