Sam-Chay : ఒక్క ట్వీట్‌తో పుకార్లకు నాగచైతన్య చెక్…! నెటిజన్ల ఎమోషన్ చూశారా..?

ఏం మాయ చేశావే సినిమాలో లాగా... మీకు కలవడం.. విడిపోవడం అలవాటే అని లైట్ తీసుకుంటున్నారు మరికొందరు. ఇద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో షేర్ చేయాలని కోరుకుంటున్నారు ఈ జంట విరాభిమానులు.

Sam-Chay : ఒక్క ట్వీట్‌తో పుకార్లకు నాగచైతన్య చెక్…! నెటిజన్ల ఎమోషన్ చూశారా..?

Samantha Nagachaitanya

Samantha – Naga Chaitanya : సమంత గురించి నాగచైతన్య చేసిన ఒకేఒక్క ట్వీట్.. ఇపుడు ట్రెండింగ్ గా మారింది. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత కలిసే ఉంటున్నారా…. కలిసే ఉంటే.. ఎందుకు సమంత తన ట్విట్టర్ అకౌంట్ పేరు మార్చింది… S అని సింపుల్ గా ఎందుకు చేంజ్ చేసింది… పేరులో అక్కినేని ఎటుపోయింది.. నాగార్జున బర్త్ డే వేడుకలకు ఎందుకు రాలేదు… చై సినిమా ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనడం లేదు.. ఇలా… ఎన్నో ప్రశ్నలు.. సందేహాలు… కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. నాగచైతన్య చేసిన ఒక్క ట్వీట్ తో… వీటికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్టయింది.

రీసెంట్ ‘లవ్ స్టోరీ’ మూవీ ట్రైలర్ ను నాగచైతన్య అకౌంట్ నుంచి రీట్వీట్ చేసింది సమంత. అప్పటివరకు… ఊపుమీదున్న పుకార్లకు కొంత బ్రేక్ పడింది. ఇదిగో… వాళ్లిద్దరూ దూరంగా ఏమీ లేరు.. మాట్లాడుకుంటున్నారు అంటూ… వార్తలు వచ్చాయి.

సమంత కాస్త లేట్ గా రియాక్టైంది. తాజాగా… తన ట్రైలర్ ను రీట్వీట్ చేస్తూ మెసేజ్ చేసిన అందరికీ థాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో రియాక్టయ్యాడు నాగచైతన్య. ఈ వరుసలోనే… సమంత చేసిన విన్నర్ ట్వీట్ ను కూడా నాగచైతన్య రీట్వీట్ చేస్తూ ఓ మెసేజ్ పెట్టాడు. సమంతను సామ్ అని సంబోధిస్తూ.. 2 డాట్స్.. 2 ఎక్స్‌క్లమేషన్(!) మార్క్స్‌తో రియాక్టయ్యాడు. Thanks Sam..!! అని పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ ఇపుడు వైరల్ అవుతోంది.

Samantha : ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌పై సమంత రియాక్షన్.. డిఫరెన్స్ గమనించారా..?

ఈ వార్త రాసే సమయానికే 2 వేల రీట్వీట్లు, పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఐతే… చై రియాక్షన్ ను చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు.. చూశారా చూశారా… వాళ్లిద్దరి మధ్య ఏమీలేదు. కలిసే ఉన్నారు అంటూ సంబురంగా ట్వీట్లు కామెంట్లు చేస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్ కు సమంతను పిలవాలని డిమాండ్లు చేస్తున్నారు. ఐతే.. మరికొందరు.. లవ్ ఎమోజీ ఎందుకు పెట్టలేదు అని ఆరాలు తీస్తున్నారు. మాకింకా డౌటే అనేది కొందరి వెర్షన్. ఏం మాయ చేశావే సినిమాలో లాగా… మీకు కలవడం.. విడిపోవడం అలవాటే అని లైట్ తీసుకుంటున్నారు మరికొందరు. ఇద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో షేర్ చేయాలని కోరుకుంటున్నారు ఈ జంట విరాభిమానులు.

Samantha Akkineni: సమంతకు సొంత బిడ్డలైన హ్యాష్, సాషా..!   

Samantha Nagachaitanya2

Samantha Nagachaitanya2