Booster Dose: బూస్టర్ డోస్‍‌లు అవసరం లేదంటున్న సైంటిస్టులు

సాధారణ ప్రజలకు సైతం బూస్టింగ్ డోస్ అవసర్లేదని సైంటిస్టులు అంటున్నారు. రీసెంట్ గా లాన్సెట్ జర్నల్‍‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. కొవిడ్-19 పూర్తి డోసు మెరుగైన...

Booster Dose: బూస్టర్ డోస్‍‌లు  అవసరం లేదంటున్న సైంటిస్టులు

Booster Dose

Booster Dose: సాధారణ ప్రజలకు సైతం బూస్టింగ్ డోస్ అవసర్లేదని సైంటిస్టులు అంటున్నారు. రీసెంట్ గా లాన్సెట్ జర్నల్‍‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. కొవిడ్-19 పూర్తి డోసు మెరుగైన ఫలితాలు ఇస్తుందని.. హాస్పిటలైజ్ కాకుండా కాపాడుతుందని వివరించారు. వ్యాక్సినేష‌న్‌కు ఇప్ప‌టికీ దూరంగా ఉన్న వారిని కాపాడేందుకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ముమ్మ‌రంగా చేప‌ట్ట‌డం మేల‌ని స్ప‌ష్టం చేసింది.

వ్యాక్సిన్ల కెపాసిటీపై జ‌రిగిన ట్రయ‌ల్స్ గురించి జ‌ర్న‌ల్స్‌, ప్రీ ప్రింట్ స‌ర్వ‌ర్వ్‌లో ప్ర‌చురిత‌మైన రీసెర్చ్ రిజల్ట్స్‌ను డ‌బ్ల్యూహెచ్ఓ, ఎఫ్‌డీఏ అధికారుల టీం మ‌దింపు చేస్తూ లేటెస్ట్ రీసెర్చ్ చేప‌ట్టింది. డెల్టా, ఆల్ఫా వేరియంట్ల నుంచి తీవ్ర కరోనా ల‌క్ష‌ణాలు సోక‌కుండా వ్యాక్సినేష‌న్ 95 శాతం స‌గ‌టు కెపాసిటీ క‌న‌బ‌రిచాయని సైంటిస్టులు పేర్కొన్నారు.

వేరియంట్ల కారణంగా పూర్తి అనారోగ్యానికి గురికాకుండా వ్యాక్సిన్లు 80శాతానికి పైగా కెపాసిటీ క‌లిగి ఉన్నాయ‌ని వెల్లడించారు. అన్ని ర‌కాల వ్యాక్సిన్లు, పలు ర‌కాల వేరియంట్ల నుంచి ప్ర‌జ‌లు తీవ్ర అనారోగ్యం బారిన‌ప‌డ‌కుండా మెరుగ్గా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నాయ‌ని స్టడీ సంతృప్తి వ్య‌క్తం చేసింది. వ్యాక్సినేష‌న్‌కు దూరంగా ఉన్న వారిలో క‌రోనా వ్యాప్తి పెరుగుతోంద‌ని, క్రమంగా వ్యాధి తీవ్ర‌త ముప్పు ఆందోళ‌న‌క‌ు గురి చేస్తుందని ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు.