Srinath Maganti: ENE 2లో చేస్తున్నా అంటే భూతులు తిట్టారు.. అది నేను లాక్కోలేదు.. కష్టపడి సంపాదించుకున్నా
ఈ నగరానికి ఏమైంది 2 సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీనాథ్ మాగంటి(Srinath Maganti).
Srinath Maganti speaks out about the negative comments he received
- ENE 2లో శ్రీనాథ్ మాగంటి
- నెగిటీవ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్
- బూతులు తిడుతూ మెసేజెస్
Srinath Maganti: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీనాథ్ మాగంటి. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. హిట్, లక్కీ భాస్కర్, యానిమల్ ఇలా చాలా సినిమాల్లో అదిరిపోయే పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సోలో హీరోగా చేస్తున్నాడు శ్రీనాథ్ మాగంటి(Srinath Maganti). అదే ‘మెన్షన్ హౌస్ మల్లేష్’.
దర్శకుడు బాల సతీష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మూవీ టీం. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో శ్రీనాథ్ మాగంటి తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
నేను హీరోగా చేస్తున్ మొదటి సినిమా ఇది. ఎన్నో కష్టాలు పడితే ఇండస్ట్రీలో ఈ స్టేజి కి వచ్చాను. నేను ఎవరి అవకాశాలను లాక్కోలేదు. నేను, ఈ నగరానికి ఏమైంది 2లో కూడా చేస్తున్నాను. కానీ, ఈ సినిమాలో నా పేరు అనౌన్స్ మెంట్ రాగానే చాలా మంది నాపై నెగిటీవ్ కామెంట్స్ చేశారు. బూతులు తిడుతూ మెసేజెస్ చేశారు. కానీ, ఆ పాత్ర నేను ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు. నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఎలాంటి రాజకీయాలు చేయలేదు. అంటూ చెప్పుకొచ్చాడు. దాంతి శ్రీనాథ్ మాగంటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
