Annagaru Vostharu OTT: ‘అన్నగారు వస్తారు’లో ఎన్టీఆర్ ఎంట్రీ.. తెలుగోళ్ళకి పండగే ఇక.. ఇదేదో ముందే చేస్తే
'అన్నగారు వస్తారు' ఓటీటీ(Annagaru Vostharu OTT)లో కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
Karthi Anna Garu vostharu new OTT version releasing soon
- ఓటీటీలోకి అన్నగారు వస్తారు కొత్త వెర్షన్
- ఈ వెర్షన్ లో ఎన్టీఆర్ ను చూపిస్తున్న మేకర్స్
- త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ప్రకటన
Annagaru Vostharu OTT: తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమాను అన్నగారు వస్తారు పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించించింది. పలు వాయిదాల కారణంగా ఈ సినిమా అనుకోకుండా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ప్లాప్ టాక్ వచ్చింది.
Deepika Pilli: క్యూట్ లుక్స్ లో దీపికా.. లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్
కథ, కథనాలు మరీ ఫేలవంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. తెలుగులోనే కాదు తమిళనాట కూడా ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. అనంతరం అన్నగారు వస్తారు(Annagaru Vostharu OTT) సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా ఓటీటీ వెర్షన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తమిళ వెర్షన్ లో సీనియర్ హీరో ఎంజిఆర్ రెఫెరెన్స్ ఉంటుంది.
ఆయన ప్లేస్ లో తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ ని చూపించారు. కానీ, ఓటీటీలో మాత్రం మార్చలేదు. దాంతో, ఈ విషయంలో అన్నగారు వస్తారు సినిమాపై విమర్శలు తలెత్తాయి. కానీ, ఇప్పుడు కొత్త వెర్షన్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వెర్షన్ లో ఎంజిఆర్ ప్లేస్ లో ఎన్టీఆర్ ని రీప్లేస్ చేశారట. కనీసం ఈ మార్పులు చేశాకనైనా మంచి రరెస్పాన్స్ వస్తుందా అని ఆలోచిస్తున్నారు మేకర్స్. అయితే, ఈమార్పులు ముందే చేసి ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చేది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. త్వరలోనే ఈ కొత్త వెర్షన్ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
