Apple Days Sale : ఏప్రిల్ 29 నుంచి ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 13పై భారీ డీల్స్.. మరెన్నో ఆఫర్లు..!

Apple Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఏప్రిల్ 29 నుంచి విజయ్ సేల్స్ (Vijay Sales)లో ఆపిల్ డేస్ సేల్ (Apple Days Sale Event) ప్రారంభం కానుంది.

Apple Days Sale : ఏప్రిల్ 29 నుంచి ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 13పై భారీ డీల్స్.. మరెన్నో ఆఫర్లు..!

Apple Days Sale on Vijay Sales starts on April 29_ Deals revealed on iPhone 13

Apple Days Sale : ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ (Vijay Sales) కొత్త ఆపిల్ డేస్ సేల్ (Apple Days Sale) ఈవెంట్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 29 నుంచి ఈ కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఈ కొత్త సేల్ ఈవెంట్ 6 రోజుల వరకు కొనసాగుతుంది. అంటే… ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమై.. మే 4న ముగుస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్‌ డేస్ సేల్‌ను కూడా మే 5 నుంచి ప్రారంభించనుంది. విజయ్ సేల్స్ మిస్ అయితే.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా స్మార్ట్‌ఫోన్లపై అనేక డిస్కౌంట్లను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందించనుంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ.61,999కి విక్రయిస్తోంది. ఈ డీల్ వివరాలు ఇంకా తెలియలేదు. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని వివరాలను వెల్లడించనుంది. విజయ్ సేల్స్‌ సందర్భంగా ఏప్రిల్ 29 నుంచి అందుబాటులో ఉండే Apple ప్రొడక్టులపై అనేక డీల్‌లను వెల్లడించింది. ఆపిల్ ల్యాప్‌టాప్‌లు, AirPods, iPhone వంటి ఇతర డివైజ్‌లపై కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్లను బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది.

Read Also : Google Pixel 7a : మే 10న గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

విజయ్ సేల్స్ సమయంలో ఐఫోన్ 14 ధర రూ.66,990కి, ఐఫోన్ 14 ప్లస్ రూ.76,490కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆపిల్ నుంచి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14 ప్రో ధర రూ. 1,17,990కు లభ్యం కానుంది. ఆపిల్ iPhone 14 Pro Max ఇప్పటివరకు ఆపిల్ నుంచి అత్యంత ఖరీదైనదిగా చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 1,28,490కి అందుబాటులో ఉంటుంది.

Apple Days Sale on Vijay Sales starts on April 29_ Deals revealed on iPhone 13

Apple Days Sale on Vijay Sales starts on April 29_ Deals revealed on iPhone 13

విజయ్ సేల్స్‌ ఆపిల్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13 (128GB స్టోరేజ్ మోడల్) ధర రూ. 59,490కు తగ్గనుంది. ఐప్యాడ్ కేటగిరీలో iPad 9th Gen మోడల్ ధర రూ. 26,490, iPad Air 5th Gen ధర రూ. 52,700 అని పేర్కొంది. ల్యాప్‌టాప్‌ల విషయానికొస్తే.. HDFC బ్యాంక్ కార్డ్‌లతో M1 చిప్‌తో కూడిన MacBook Air రూ.77,900 కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది.

M2 చిప్ ధరతో MacBook Air ధర రూ. 1,02,790కి తగ్గనుంది. M2 చిప్‌లతో కూడిన MacBook Pro ధర రూ. 1,11,900కి తగ్గనుంది. M2 ప్రో చిప్‌తో కంపెనీ నుంచి టాప్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన MacBook Pro బ్యాంక్ ఆఫర్‌లతో రూ.1,74,900కు అందుబాటులో ఉండనుంది.

ఆపిల్ వేరబుల్‌ని కొనుగోలు చేసే యూజర్లు (Apple Watch Series 8)ని రూ. 39,990 ధరతో కొనుగోలు చేయొచ్చు. Apple Watch SE (2nd Gen) HDFC బ్యాంక్ కార్డ్‌లతో రూ. 25,990 ధర ఉంటుంది. కంపెనీ వివరాల ప్రకారం.. MagSafe ఛార్జింగ్ కేసుతో కూడిన AirPods Pro (2వ జనరేషన్) విజయ్ సేల్స్‌లో Apple Days సేల్ సమయంలో రూ. 23,490కి తగ్గనుంది.

Read Also : Samsung Galaxy M14 : కేవలం రూ.13,490కే శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. అమెజాన్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!