Samsung Galaxy M14 : కేవలం రూ.13,490కే శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. అమెజాన్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Samsung Galaxy M14 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ 5Gపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడే కొనేసుకోండి.

Samsung Galaxy M14 : కేవలం రూ.13,490కే శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. అమెజాన్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Samsung Galaxy M14 5G gets discounted, effectively available at Rs 13,490 on Amazon

Samsung Galaxy M14 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి M14 సిరీస్ 5G ఫోన్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ శాంసంగ్ M14 ఫోన్ రూ. 14,990 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో ఈ 5G ఫోన్‌పై రూ. 1,500 తగ్గింపును అందిస్తోంది.

HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ ధర రూ. 13,490 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ధర 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ కొత్త (Samsung 5G) ఫోన్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి అనేదానికి 4 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ M14 5G కొనుగోలుకు 4 కారణాలివే :
శాంసంగ్ గెలాక్సీ M14 సిరీస్ ఫోన్ అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వచ్చింది. రూ. 20వేల సెగ్మెంట్ ఫోన్ల కన్నా అద్భుతమైన కెమెరా షాట్‌లను అందిస్తుంది. కొన్ని కెమెరా షాట్‌లలో కలర్స్ కొంచెం వైబ్రెంట్‌గా అనిపించవచ్చు. అద్భుతమైన షాట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్కెమెరా ఏదైనా అబ్జెక్ట్‌ను ఫోకస్ చేయగలదు.

Read Also : Samsung Galaxy S22 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

షట్టర్ స్పీడ్ కూడా బాగుంటుంది. తక్కువ కాంతిలోనూ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది. మొత్తం మీద, భారత మార్కెట్లో రూ. 15వేల కన్నా తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M14 5G కొనుగోలు చేసేందుకు మరో కారణం.. సాలిడ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Samsung Galaxy M14 5G gets discounted, effectively available at Rs 13,490 on Amazon

Samsung Galaxy M14 5G gets discounted, effectively available at Rs 13,490 on Amazon

సగటు వినియోగంతో పూర్తిగా 2 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ 5G ఫోన్‌లో భారీ 6,000mAh బ్యాటరీ ఉందని గమనించాలి. ఈ బడ్జెట్ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. స్క్రీన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పెద్ద 6.6-అంగుళాల LCD ప్యానెల్‌తో పాటు LCD డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది.

M14 5G ఫోన్ ధర తక్కువ అయినా.. స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. ఈ ఫోన్ కొన్నప్పటికీ ఛార్జర్ కోసం అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ M14 5Gని కొనుగోలు చేస్తే.. 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్టును అందిస్తుంది.

Read Also : Airtel 5G Plus : దేశవ్యాప్తంగా 3వేల నగరాల్లోకి ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. 5G ప్లాన్ల ఫుల్ లిస్టు ఇదిగో.. ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?