Honda City Discounts : హోండా కార్స్ ఇండియా బంపర్ ఆఫర్.. ఈ హోండా సిటీ కార్లపై కళ్లుచెదిరే క్యాష్ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

Honda City Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) ఫిబ్రవరిలో 5వ జనరేషన్ హోండా సిటీ కార్లపై పై రూ.72,493 వరకు భారీ డిస్కౌంట్లను ఆఫర్లను అందిస్తోంది.

Honda City Discounts : హోండా కార్స్ ఇండియా బంపర్ ఆఫర్.. ఈ హోండా సిటీ కార్లపై కళ్లుచెదిరే క్యాష్ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

Honda City Discounts, offers up to Rs 72,493 in February

Honda City Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) ఫిబ్రవరిలో 5వ జనరేషన్ హోండా సిటీ కార్లపై పై రూ.72,493 వరకు భారీ డిస్కౌంట్లను ఆఫర్లను అందిస్తోంది. అంతేకాదు.. క్యాష్ తగ్గింపు లేదా అదనపు బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, కస్టమర్ లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో అందిస్తోంది. హోండా సిటీ కారు V, VX, ZX మొత్తం మూడు గ్రేడ్‌లలో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంది.

మిడ్-సైజ్ సెడాన్ ధర రూ. 11.87 లక్షల నుంచి రూ. 15.62 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 1.5-లీటర్ i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్ 121PS గరిష్ట శక్తి, 145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా CVT ఆటోమేటిక్ (పాడిల్ షిఫ్టర్‌)తో యాడ్ చేయవచ్చు.

1.5-లీటర్ i-DTEC DOHC డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100PS పవర్, 200Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ MT మాత్రమే ఉంది. ARAI ధృవీకరణల ప్రకారం.. హోండా సిటీ మైలేజ్ పెట్రోల్ మాన్యువల్‌కు 17.8kmpl, పెట్రోల్ CVT ఆటోమేటిక్‌కు 18.4kmpl, డీజిల్ మాన్యువల్‌కు 24.1kmplగా మైలేజ్ అందిస్తుంది.

Honda City Discounts, offers up to Rs 72,493 in February

Honda City Discounts, offers up to Rs 72,493 in February

Read Also : Ampere Primus Electric Scooter : ఆంపియర్ ప్రైమస్ హై-స్పీడ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 100కి.మీ స్పీడ్.. కేవలం రూ.499లకే బుకింగ్ చేసుకోండి..!

హోండా సిటీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవే :
(MT) రూ. 30వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 32,493 వరకు FOC అప్లియెన్సెస్
(MT) రూ. 20వేల విలువైన కారు ఎక్స్చేంజ్‌పై తగ్గింపు
(MT) కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5వేలు
(MT) హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7వేలు
(MT) కార్పొరేట్ తగ్గింపు రూ. 8వేలు
(CVT) రూ. 20వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 21,643 వరకు FOC అప్లియన్సెస్
(CVT) రూ. 20వేల విలువైన కారు ఎక్స్ఛేంజ్‌పై డిస్కౌంట్
(CVT) కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5వేలు
(CVT) హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7వేలు
(CVT) కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 8వేలు

హోండా 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. మిడ్-సైజ్ ఫిబ్రవరి చివరి నాటికి హోండా డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోనుంది. మార్చి 2న షోరూమ్‌లలో అందుబాటులోకి రానున్నాయి.

Read Also : Netflix Sharing Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై మీ ఫ్రెండ్స్‌తో పాస్‌వర్డ్ షేరింగ్ కష్టమే.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!