Ampere Primus Electric Scooter : ఆంపియర్ ప్రైమస్ హై-స్పీడ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 100కి.మీ స్పీడ్.. కేవలం రూ.499లకే బుకింగ్ చేసుకోండి..!

Ampere Primus Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్‌న్యూస్. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.

Ampere Primus Electric Scooter : ఆంపియర్ ప్రైమస్ హై-స్పీడ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 100కి.మీ స్పీడ్.. కేవలం రూ.499లకే బుకింగ్ చేసుకోండి..!

Ampere Primus Electric Scooter Launched at a Price of 1.09 Lakh, Booking Starts

Ampere Primus Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్‌న్యూస్. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ వెహికల్స్ (Ampere)కు చెందిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (GEMPL), గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఇ-మొబిలిటీ యూనిట్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఆంపియర్ ప్రైమస్ (Ampere Primus Electric Scooter) అనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రవేశపెట్టింది.

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకారం.. రూ. 1.1 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న ఈవీ స్కూటర్ మోడల్ దేశీయంగా అందుబాటులోకి వస్తోంది. ‘మేక్-ఇన్-ఇండియా’ ప్రొడక్టుల్లో భాగంగా ఆంపియర్ ప్రైమస్‌ ఫ్లాగ్‌షిప్ స్కూటర్ మార్కెట్లోకి తీసుకొస్తున్నామని ఈవీ బ్రాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ సంజయ్ బెహ్ల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో తమ కస్టమర్‌లకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రైమస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్, స్పీడ్, సరసమైన ధర రెండింటినీ భారతీయ మార్కెట్‌కు అందించడం పట్ల చాలా సంతోషంగా ఉందని సీఈఓ సంజయ్ చెప్పారు. ఈ స్కూటర్లు పర్యావరణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ అనే లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నామని తెలిపారు.

Ampere Primus Electric Scooter Launched at a Price of 1.09 Lakh, Booking Starts

Ampere Primus Electric Scooter Launched at a Price of 1.09 Lakh, Booking Starts

Read Also : Infinity Scooter Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌‌పై సేల్.. ఇప్పుడే ఆర్డర్ చేసుకోండిలా..!

ప్రైమస్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3Kwh LFP బ్యాటరీ టెక్నాలజీ ఉంది. స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. కేవలం 5 సెకన్లలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4KW మోటార్ ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 100 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఈ స్కూటర్‌లో ఎకో, సిటీ, పవర్, రివర్స్ అనే 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, ఫోన్ యాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Ampere Primus Electric Scooter Launched at a Price of 1.09 Lakh, Booking Starts

Ampere Primus Electric Scooter Launched at a Price of 1.09 Lakh, Booking Starts

ఇతర ఫీచర్లు డెడికేటెడ్ ఫోన్ అప్లికేషన్, LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్, PMS (పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్) మోటార్, బెల్ట్ డ్రైవ్, నావిగేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. లాంగర్ లెగ్ రూమ్, వైడర్ సీట్లు వంటి ప్రత్యేకతలు కూడా కలిగి ఉంది. ఈ స్కూటర్ మొత్తం మాలయన్ వైట్, రాయల్ ఆరెంజ్, హవెలాక్ బ్లూ, బక్ బ్లాక్ వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. డ్యూయెల్ టోన్ రంగులో కూడా ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ఆంపియర్ ప్రైమస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఇటీవలే కంపెనీ ప్రకటించింది. ప్రైమస్ రూ.1,09,900 ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది. ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ వరకు కేవలం రూ. 499 ధరతో బుకింగ్‌లకు అందుబాటులో ఉంది.

ఆంపియర్ ప్రైమస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ :
* GEMPL ప్రకారం.. ఈ మోడల్ గరిష్టంగా 77 kmph వేగాన్ని అందిస్తుంది.
* వాహనం ‘పవర్’ మోడ్‌లో పూర్తి ఛార్జ్‌పై 100 కి.మీల కన్నా ఎక్కువ రేంజ్‌ను ఇస్తుంది.
* ప్రైమస్ సిటీ, ఎకో, రివర్స్ మూడు ఇతర మోడ్‌లను కలిగి ఉంది.
* ఆఫర్‌లో బ్యాటరీ స్మార్ట్ BMS (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్)తో కూడిన 3 kWh యూనిట్ అందిస్తుంది.
* స్కూటర్ లెగ్‌రూమ్, వైడ్ సీటింగ్, మెరుగైన డ్రైవబిలిటీతో వస్తుంది.
* ముందు భాగంలో అద్భుతమైన ప్యానెల్ డిజైన్ కలిగి ఉంది.
* ఛార్జింగ్ సమయం : 15A ఛార్జర్‌ ద్వారా 4.5 గంటలు, 25Aని ఉపయోగించి 2.5 గంటలు
* యాక్సలేరేషన్ : 4.2 సెకన్లలో 0-40కిమీ/గం
* బూట్ స్పేస్ : 22L మోడ్‌లు ఎకో, సిటీ, పవర్.
* బ్యాటరీ కెపాసిటీ : 3kW లి-ఫాస్ఫేట్ బ్యాటరీ
* టాప్ స్పీడ్ : గంటకు 77 కి.మీ

Read Also : Electric Scooters in India : కొత్త ఈవీ స్కూటర్ కొంటున్నారా? 2023లో టాప్ 7 చౌకైన తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. లైసెన్స్ లేకుండానే నడపొచ్చు!