Infinity Scooter Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌‌పై సేల్.. ఇప్పుడే ఆర్డర్ చేసుకోండిలా..!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్ ప్రారంభించనుంది. ఈసారి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ-స్కూటర్‌లను విక్రయించనుంది.

Infinity Scooter Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌‌పై సేల్.. ఇప్పుడే ఆర్డర్ చేసుకోండిలా..!

Infinity scooter Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్ ప్రారంభించనుంది. ఈసారి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ-స్కూటర్‌లను విక్రయించనుంది. ఇప్పటికే ఆటో మొబైల్ దిగ్గజం ఇన్ఫినిటీ సరికొత్త ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు Flipkart ద్వారా E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్డర్ చేయవచ్చు. ఈ-స్కూటర్ ఫ్లిప్ కార్ట్‌లో రూ.70,499 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రీపెయిడ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 5వేల తగ్గింపు కూడా ఉంది. ప్రాథమికంగా కొనుగోలుదారులు స్కూటర్‌ను రూ. 65,499 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Flipkart లిస్టింగ్ ప్రకారం.. కొనుగోలుదారులు డీలర్‌కి ఛార్జర్‌కి కూడా అదనపు మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ప్రాథమికంగా బీమా, రిజిస్ట్రేషన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా ఉన్నాయి. మీరు ఛార్జర్ కోసం అదనంగా రూ.7,601 నుంచి రూ.9,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ప్రీపెయిడ్ లావాదేవీ ఆఫర్‌ కోసం మొత్తం ఖర్చు రూ. 83,099 అవుతుంది. మీరు ఆఫర్ లేకుండా అయితే మొత్తంగా రూ. 5,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కూటర్‌కు కంపెనీ 3 ఏళ్ల వరకు వారంటీ కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం స్కూటర్‌ల పరంగా విస్తృత శ్రేణి పోర్ట్‌ఫోలియో లేదు. బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ల రిజల్ట్స్ మాత్రమే అందిస్తోంది.

Flipkart Starts Selling Infinity Scooter On Its Website, May Add More Evs To List (1)

Flipkart Starts Selling Infinity Scooter On Its Website, May Add More Evs To List

రాబోయే రోజుల్లో ఇతర కంపెనీల నుంచి మరిన్ని ఈవీ స్కూటర్ల సేల్ ఉండవచ్చు. అయితే, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ అంతటా ఆర్డర్లకు అందుబాటులో లేదు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే డెలివరీ కానుంది. CarandBike.com నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. న్యూఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తెలంగాణ ఉన్నాయి. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిటీ స్కూటర్ కోసం ఆర్డర్ చేసిన తర్వాత.. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ డెలివరీని నిర్వహించే సమీపంలోని అధీకృత డీలర్ నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్‌ను చేసిన తర్వాత 15 రోజులలోపు కస్టమర్‌లకు ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ డెలివరీ అవుతుందని బౌన్స్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం.. యూజర్లు తమ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసి.. పూర్తి వాపసు కూడా పొందవచ్చు.

Read Also :  Flipkart Big Saving Days Sale : ఆపిల్ ఐఫోన్ 11 ధర తగ్గిందోచ్.. బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్.. డోంట్ మిస్!