Netflix Sharing Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై మీ ఫ్రెండ్స్‌తో పాస్‌వర్డ్ షేరింగ్ కష్టమే.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

Netflix Sharing Password : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు అలర్ట్.. మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్ మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయడం కుదరదు.. ఎందుకంటే..

Netflix Sharing Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై మీ ఫ్రెండ్స్‌తో పాస్‌వర్డ్ షేరింగ్ కష్టమే.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

Netflix will soon stop users from sharing password with friends_ 5 things to know

Netflix Sharing Password : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు అలర్ట్.. మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్ మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయడం కుదరదు.. ఎందుకంటే.. త్వరలో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ (Netflix Password Sharing) విధానానికి బ్రేక్ వేయనుంది. మీ స్నేహితులతో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్ షేర్ చేసేందుకు ప్రయత్నిస్తే.. అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేసే యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు ఇదివరకే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ చాలాసార్లు స్పష్టం చేసింది.

2017లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో వినియోగదారులు ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ఈ షేరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ, ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు తమ అకౌంట్‌ను తమతో నివసిస్తున్న యూజర్లతో కాకుండా మరెవరితోనైనా షేర్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాలని చెబుతోంది. అసలు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని కంపెనీ ఎందుకు బ్రేక్ చేస్తుందో తెలియాలంటే ఈ ఐదు ముఖ్యమైన విషయాల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..

నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై 5 ముఖ్యమైన అంశాలివే :
1. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇప్పటికే వివిధ ప్రాంతాలలో చాలా మంది వినియోగదారులకు అదనపు ఛార్జీలు విధిస్తోంది. 2023 మొదటి త్రైమాసికంలో చాలా ప్రాంతాలకు పాస్‌వర్డ్-షేరింగ్ విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. Netflix ఇటీవలే ఉత్తర అమెరికా, కొన్ని ఇతర ప్రాంతాలలోని యూజర్ల నుంచి ఛార్జీలు విధించడం ప్రారంభించింది. మార్చి నెలాఖరులో యూకేలో కూడా అదే విధంగా చేయాలని నెట్‌ప్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Netflix will soon stop users from sharing password with friends_ 5 things to know

Netflix will soon stop users from sharing password with friends

Read Also : Ampere Primus Electric Scooter : ఆంపియర్ ప్రైమస్ హై-స్పీడ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 100కి.మీ స్పీడ్.. కేవలం రూ.499లకే బుకింగ్ చేసుకోండి..!

2. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను స్నేహితులతో లేదా వారి బంధువులతో షేరింగ్ చేసే యూజర్లకు ఛార్జీలు విధించాలని స్పష్టంగా పేర్కొంది. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో యాంటీ-షేరింగ్ ప్లాన్‌లను రూపొందించింది. కాలక్రమేణా మరిన్ని దేశాలకు విస్తరించింది. భారత్‌లో ప్రస్తుతానికి ఎలాంటి జాబితా అందుబాటులో లేదు. కానీ, భారతీయ నెట్‌ఫ్లిక్స్ యూజర్లు దీనికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫారమ్ 2023 మొదటి త్రైమాసికంలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్నట్టు ఇటీవల వెల్లడించింది.

3. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల్లో భారత్ కీలకమైన మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ దేశంలో 5 మిలియన్ల యూజర్ బేస్ ఉన్నట్లు తెలిపింది. అయితే, అధికారికంగా ధృవీకరించలేదు. చాలా మంది భారతీయులు తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ యూజర్లపై కూడా నెట్‌ఫ్లిక్స్ అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంది. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఎప్పుడు ముగించనుందో తెలియదు. దీనికి చాలా సమయం పట్టేలా కనిపించడం లేదు. ప్రత్యేకించి రాబోయే నెలల్లో విస్తృత స్థాయిలో ఈ విధానాన్ని ముగించనున్నట్లు కంపెనీ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ త్వరలో తమ అకౌంట్ స్నేహితులతో షేరింగ్ చేసుకునే యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను ప్రారంభించనుంది.

Netflix will soon stop users from sharing password with friends_ 5 things to know

Netflix will soon stop users from sharing password with friends

4. ఒకే ఇంట్లో నివసించే వ్యక్తులు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను షేరింగ్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారులు బయటి యూజర్లతో అకౌంట్లను షేరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. కంపెనీ వారికి అదనపు ఛార్జీలు విధించాలని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా వేరే ప్రదేశానికి మారితే.. ఆ వ్యక్తి అదే Netflix అకౌంట్ ఉపయోగించలేరని గుర్తుంచుకోండి. ఎందుకంటే Netflix బయటి ప్రాంతాల్లో మీ అకౌంట్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను అనుమతించదు.

5.  మీరు ఎవరితోనైనా పాస్‌వర్డ్‌ను షేర్ చేసేందుకు ప్రయత్నిస్తే నెట్‌ఫ్లిక్స్ వెంటనే గుర్తిస్తుంది. మీ డివైజ్ ఒకే ఇంటిలో అకౌంట్ ఉపయోగిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి దాని వెబ్‌సైట్ ‘IP అడ్రస్, డివైజ్ IDలు, నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లలో సైన్ ఇన్ చేసిన డివైజ్ నుంచి అకౌంట్ యాక్టివిటీని ఉపయోగిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Read Also : OnePlus 5G Phone : వన్‌ప్లస్ నుంచి మరో సరికొత్త 5G ఫోన్ వస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?