LPG Cylinder Price : మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధర పెంచేశాయి. సిలిండర్ ధర మళ్లీ రూ. 25 పెరిగింది. ఈ రోజు నుంచే పెరిగిన సిలిండర్ ధర అమల్లోకి వస్తుంది.

LPG Cylinder Price : మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

Lpg Cylinder Price Hiked Again

LPG Cylinder Price : గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధర పెంచేశాయి. ఎల్ పీజీ సిలిండర్ ధర మళ్లీ రూ. 25 పెరిగింది. ఈ రోజు నుంచే పెరిగిన సిలిండర్ ధర అమల్లోకి వస్తుంది. ఎల్ పీజీ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లో ఇది రెండోసారి. సిలిండర్ ధర పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.884కు చేరింది. 2021 ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉంది. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ ధర కాస్తా రూ.884కు పెరిగింది. రెండు వారాల్లోనే రూ. 50 వరకు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.

2014 మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వద్ద ఉండేది. కానీ, ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.75 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే వినియోగదారులంతా ఇక నుంచి రూ.975 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ ధర రూ.945 అయితే.. డెలివరీ బాయ్ ఛార్జీలు రూ.30లతో కలిపి రూ.975 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకేమంది సిలిండర్ ధర దాదాపు రూ.1000 మార్క్ చేరువైనట్టే..
Hyd Metro Sale : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. వాటాలు విక్రయిస్తాం.. ఎల్అండ్‌టీ!

స్థానిక పన్నుల కారణంగా LPG సిలిండర్ల ధర ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారుతుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సరుకు రవాణా ఛార్జీలతో పడే అధిక ధరను వినియోగదారులను సబ్సిడీ కింద అందిస్తోంది. ప్రభుత్వం-సబ్సిడీ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఏడాదికి 12 సిలిండర్లకు అర్హత ఉంటుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం నెల నుండి నెలకు మారుతుంది. LPG సిలిండర్ సహా ATF ధరలు, ప్రతి నెల ప్రారంభంలో బెంచ్‌మార్క్ ఇంధనం సగటు అంతర్జాతీయ రేటు, మునుపటి నెలలో విదేశీ మారకం రేటు ఆధారంగా సవరిస్తుంటారు.

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి. NYMEX గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ఫ్యూచర్స్ కూడా పడిపోయాయి. ఐదా హరికేన్ తర్వాత మెక్సికో గల్ఫ్ ఆఫ్ మెక్సికో చమురు, గ్యాస్ ఉత్పత్తిలో కనీసం 94 శాతం క్షీణించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా ఆల్ టైం హై రికార్డును చేరుకున్నాయి.

UP : కొత్త దొంగలు, దొంగిలించారు..రూ. 500 ఇచ్చారు, కాళ్లు మొక్కారు