Hyd Metro Sale : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. వాటాలు విక్రయిస్తాం.. ఎల్అండ్‌టీ!

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. వాటాలను విక్రయించాలని ఎల్ అండ్ టీ నిర్ణయించింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రోలో వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Hyd Metro Sale : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. వాటాలు విక్రయిస్తాం.. ఎల్అండ్‌టీ!

L&t Announces Hyderabad Metro, Nabha Power Plant

Hyderabad metro for sale : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. భారతదేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రోలో వాటాలను అమ్మేందుకు కంపెనీ నిర్ణయించింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రోలో వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో లార్సన్‌ అండ్‌ టూబ్రో (L&T) వాటాను విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. కీలకేతర ఆస్తులను అమ్మేస్తున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది. నాబా కోర్ ఆస్తులు 1400 మెగావాట్ (MW) నాభా థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన జాబితాలో హైదరాబాద్ మెట్రోతో పాటు ఇతర ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. ఒకవైపు మెట్రోను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూనే మరోవైపు రుణాల కోసం సంస్థ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనాతో పాటు అప్పుల కారణంగా ఎల్ అండ్ టీపై భారం పెరిగింది. మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా.. వివిధ కారణాలతో రూ.18,971 కోట్లకు అంచనాలు చేరాయి. అయితే అప్పుల ద్వారా సేకరించిన మొత్తం రూ.13,500 కోట్లు ఉన్నాయి. 2019-20లో రూ.383 కోట్ల నష్టాలను చవిచూసింది. 2020-21లో ఏకంగా రూ.1,766 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఈ మేరకు సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీకే సేన్‌ సంకేతాలిచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఎల్‌అండ్‌టీకి చెందిన 99 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును రెన్యూ పవర్‌ కంపెనీకి విక్రయించిన విషయాన్ని విడుదల చేసిన ప్రకటనలో సేన్‌ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP)లో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీకి 90 శాతం వాటా ఉండగా, 10 శాతం వాటా ఉంది. పంజాబ్‌లోని రాజ్‌పురాలోని 2×700 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నాభా పవర్‌లో ప్రాథమికేతర ఆస్తులను ఇప్పటికే గుర్తించారు. అయితే ఇందులో పూర్తి వాటాను విక్రయిస్తారా? లేక కొంత వాటానా? అన్నది మాత్రం వెల్లడించలేదు.
India : భారత్‌ రోడ్లపై టెస్లా కార్ల రయ్‌.. రయ్‌

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుతోపాటు పంజాబ్‌లోని నభా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్నికూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలోని ఇతర ఆస్తులను కూడా విక్రయించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు ఆరు నెలలు మెట్రో రైల్‌ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది కూడా నష్టాలకు కారణంగా చెబుతోంది. ప్రసుత్తానికి మెట్రో సర్వీసులు నడుస్తున్నా కొవిడ్‌కు ముందు ఉన్నంత రద్దీ కనిపించడం లేదు. ఈ ఆర్థిక ఏడాదిలో కూడా నష్టాలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ ఆధారిత గ్రీన్‌కో ఆన్-డిమాండ్ విద్యుత్ అందించే ప్రణాళికలో భాగంగా దేశంలోని ఆరు రాష్ట్రాలలో 8 GW సామర్థ్యంతో విద్యుత్ నిల్వ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ప్రస్తుత మెట్రో కష్టాల నుంచి బయటపడేందుకు తక్కువ వడ్డీతో రూ.5 వేల కోట్ల రుణసాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎల్‌అండ్‌టీ కోరినట్టు తెలిసింది. కానీ, ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. పెట్టుబడుల కోసం ఇతర కంపెనీలతో జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో తమ వాటాను విక్రయించడం తప్ప మరో మార్గం లేదని ఎల్ అండ్ టీ భావిస్తున్నట్టు సమాచారం.

Kabul Attack : లాలించిన మహిళా సైనికురాలు ఇక లేరు