Kabul Attack : లాలించిన మహిళా సైనికురాలు ఇక లేరు

చంటిపిల్లలను అమెరికా సైనికులు, ఇతర సైనికులు కంటికి రెప్పలా చూసుకున్నారు. అందులో మహిళా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ ఒకరు. ఈమె కూడా చంటి పిల్లలను ఎత్తుకుని..తల్లిలా లాలించింది.

Kabul Attack : లాలించిన మహిళా సైనికురాలు ఇక లేరు

Taliban

Nicole Gee : అప్ఘానిస్తాన్ లో తమ పిల్లలను దేశాన్ని తరలించాలని ఆ తల్లులు చేసిన ప్రయత్నాలు అందర్నీ కదిలించివేశాయి. ఆ చంటిపిల్లలను అమెరికా సైనికులు, ఇతర సైనికులు కంటికి రెప్పలా చూసుకున్నారు. అందులో మహిళా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ ఒకరు. ఈమె కూడా చంటి పిల్లలను ఎత్తుకుని..తల్లిలా లాలించింది, ఏడిస్తే..ఓదార్చింది. నేనున్నానంటూ తల్లిలా అభయమిచ్చింది. ‘నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ ఇన్ స్ట్రాగ్రామ్ లో చిన్నారితో దిగిన ఫొటో పోస్టు చేశారు.

Read More : Karnataka : డ్రగ్స్ కేసు.. పోలీసుల కంటపడకుండా బాత్‌రూమ్ లో దాక్కున్న నటి

America

దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అమెరికన్లే..కాకుండా ఇతరులు ఆమెకు సలామ్ కొట్టారు. కానీ..ఈమె ఇక లేరనే విషయం తెలుసుకున్న ప్రపంచం దిగ్ర్భాంతికి గురైంది. ప్రధానంగా అమెరికన్లు షాక్ తిన్నారు. కాబూల్ లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణించడానికి ఆరు రోజుల ముందు…చేసిన ఫొటోను చూసి చలించిపోతున్నారు. ఈమె భర్త మెరైన్ గా పనిచేస్తున్నారు.

Read More :KBC 13 : బిగ్‌బి కౌన్‌‌బనేగా కరోడ్‌పతికి వచ్చాడు.. చిక్కుల్లో పడ్డాడు!

దీనిపై నికోల్ సోదరి మిస్టీ ప్యూకో స్పందించారు. తన సోదరే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, నికోల్ అంత్యక్రియల ఖర్చు కోసం క్రౌడ్ ఫండింగ్ ను ఆశ్రయించినట్లు తెలిపారు. కొన్ని రోజుల్లోనే 1,40,000 డాలర్లు చందాల రూపంలో వచ్చాయని, ఈ మొత్తాన్ని అంత్యక్రియల నిమిత్తం ఖర్చు చేస్తామన్నారు.

ఇప్పటికీ దేశంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. బాంబుదాడులతో  దద్దరిల్లుతున్న దేశంలో ఎప్పుడేం జరుగుతుందో..మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియడం లేదు.  15 రోజుల్లోనే  నిరంకుశ ఫత్వాలు, అర్ధంలేని ఆంక్షలు, ఇష్టారీతి ఆదేశాలుతో తమ అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే చెప్పేశారు తాలిబన్లు. అప్ఘాన్ అంతటా నెత్తుటేరులు పారిస్తున్నారు. ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. మొత్తంగా అప్ఘాన్‌ను 20 ఏళ్ల వెనక్కే కాదు..మధ్య యుగాల నాటికి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.