UP : కొత్త దొంగలు, దొంగిలించారు..రూ. 500 ఇచ్చారు, కాళ్లు మొక్కారు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనం చేసిన తర్వాత..వృద్ధ దంపతులకు కాళ్లు మొక్కి..మరలా ఇచ్చేస్తాం అంటూ వెళ్లిపోయారు దొంగలు.

UP : కొత్త దొంగలు, దొంగిలించారు..రూ. 500 ఇచ్చారు, కాళ్లు మొక్కారు

Up

Robbers : దొంగలు ఏం చేస్తారు ? ఏం చేస్తారు ? అదేం ప్రశ్న. దొంగతనం చేస్తారు, అందినకాడికి దోచుకెళుతారు అంటారు కదా. కానీ..దోచుకున్న సొమ్మును త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాం అంటూ చేతిలో కొన్ని డబ్బులు పెట్టి వెళ్లిపోయే దొంగల గురించ తెలుసా ? అవును ఓ ప్రాంతంలో ఇలాంటి దొంగల విషయం బయటకొచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనం చేసిన తర్వాత..వృద్ధ దంపతులకు కాళ్లు మొక్కి..మరలా ఇచ్చేస్తాం అంటూ వెళ్లిపోయారు దొంగలు.

Read More : Hyd Metro Sale : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. వాటాలు విక్రయిస్తాం.. ఎల్అండ్‌టీ!

ఘజియాబాద్.. రాజ్ నగర్ లో సురేంద్ర వర్మ, భార్య అరుణ వర్మ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వివాహం అయిన తర్వాత..విదేశాల్లో ఉంటున్నారు. సోమవారం రాత్రి సమయంలో వీరింట్లోకి దొంగలు ప్రవేశించారు. వృద్ధ దంపతులను బెదిరించారు. అనంతరం అందినకాడికి దోచుకున్నారు.

Read More : India : భారత్‌ రోడ్లపై టెస్లా కార్ల రయ్‌.. రయ్‌

వెళ్లిపోయే ముందు…ఏమనుకున్నారో ఏమో..ఆ వృద్ధ దంపతుల కాళ్లు మొక్కి..చేతిలో రూ. 500 పెట్టారు.  దోచుకున్న డబ్బు, బంగారం మొత్తం ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి వెళ్లిపోయారు. ఇది చూసిన ఆ వృద్ధ దంపతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దొంగల చేతుల్లో మారణాయుధాలు ఉండడంతో వృద్ధ దంపతులు ఏమీ చేయలేకపోయారు. ఒకటిన్నర లక్షల రూపాయల నగదు, నాలుగు లక్షల రూపాయల విలువ చేసే నగలు దోచుకున్నట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.