Kcr: కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు.. విచారణ తేదీ, సమయం, ప్లేస్ ఫిక్స్
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ బృందం తోసిపుచ్చింది.
Kcr Representative Image (Image Credit To Original Source)
Kcr: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో విచారిస్తామని నోటీసుల్లో తెలిపారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని చెప్పారు. నందినగర్ లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ బృందం తోసిపుచ్చింది. నందినగర్ లోని నివాసంలోనే ఎంక్వైరీ చేస్తామని కేసీఆర్ కు తేల్చి చెప్పింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు కేసీఆర్ ను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు నోటీసులు ఇవ్వగా.. ఆరోజు తనకు విచారణ నుంచి మినహాయింపును కోరారు కేసీఆర్. అంతేకాదు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలని అభ్యర్థన చేశారు. విచారణ తేదీ నుంచి మినహాయింపు ఇచ్చిన సిట్ అధికారులు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న అభ్యర్థనను మాత్రం తిరస్కరించారు. హైదరాబాద్ పరిధిలోనే ఎంక్వైరీ చేస్తామని తేల్చి చెప్పారు.
Also Read: ఆరూరి రమేష్ తిరిగి కారెక్కింది అందుకేనా? ఆ మాజీ ఎమ్మెల్యేలో కలవరం దేనికి?
