×
Ad

Kcr: కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు.. విచారణ తేదీ, సమయం, ప్లేస్ ఫిక్స్

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ బృందం తోసిపుచ్చింది.

  • Published On : January 30, 2026 / 07:41 PM IST

Kcr Representative Image (Image Credit To Original Source)

  • హైదరాబాద్ నివాసంలోనే సిట్ విచారణ
  • ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థన తిరస్కరణ
  • ఎన్నికల అఫిడవిట్ లోని చిరునామా ఆధారంగా నందినగర్ నివాసంలోనే ఎంక్వైరీ
  • ఈసారి విచారణకు హాజరుకావడంలో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టత

Kcr: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వెళ్ళి అక్కడి సిబ్బందికి నోటీసులు అందించారు సిట్ అధికారులు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్ లో ఉన్న నివాసంలోనే కేసీఆర్ ను విచారిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1న విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాగా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ బృందం తోసిపుచ్చింది.

నందినగర్ లోని నివాసంలోనే ఎంక్వైరీ చేస్తామని కేసీఆర్ కు తేల్చి చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది సిట్ బృందం. ఎన్నికల అఫిడవిట్ లోని చిరునామా ఆధారంగా నందినగర్ నివాసంలో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు కేసీఆర్ ను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు నోటీసులు ఇవ్వగా.. ఆరోజు తనకు విచారణ నుంచి మినహాయింపును కోరారు కేసీఆర్. అంతేకాదు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలని అభ్యర్థన చేశారు. విచారణ తేదీ నుంచి మినహాయింపు ఇచ్చిన సిట్ అధికారులు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న అభ్యర్థనను మాత్రం తిరస్కరించారు. హైదరాబాద్ పరిధిలోనే ఎంక్వైరీ చేస్తామని తేల్చి చెప్పారు.

ఫామ్‌హౌస్‌లో విచారణకు నో చెప్పడానికి కారణాలు ఇవే..!

కాగా, ఫామ్‌హౌస్‌లో విచారణ చేసేందుకు నిరాకరించడానికి గల కారణాలను సిట్ అధికారులు వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. అంతేకాదు విచారణను రికార్డ్ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. కేసు నెం 243/2024లో ఎమ్మెల్యే కేసీఆర్ కి ఏసీపీ సమాధానం ఇచ్చారు. సెక్షన్ 160 Cr.P.C నోటీస్ చట్ట బద్ధమే అని స్పష్టం చేశారు. అధికారిక రికార్డుల ప్రకారం హైదరాబాద్ నివాసంలోనే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎర్రవల్లి గ్రామంలో విచారణకు అనుమతి లేదన్నారు పోలీసులు.

ఎన్నికల అఫిడవిట్, అసెంబ్లీ రికార్డుల్లో హైదరాబాద్ చిరునామానే నివాసంగా ఉందని వెల్లడించారు. వయసు దృష్ట్యా హైదరాబాద్ నివాసంలోనే విచారణకు సౌకర్యం కల్పించామని వివరించారు. అధికారిక నివాసం కాకుండా ఇతర ప్రాంతాల్లో విచారణ జరపలేమని స్పష్టం చేశారు. సున్నితమైన ఎలక్ట్రానిక్, భౌతిక ఆధారాల తరలింపు సాధ్యం కాదని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నివాసంలో హాజరు కావాలని ఆదేశించారు. ఈసారి విచారణకు హాజరుకావడంలో ఎలాంటి మినహాయింపు లేదని ACP తేల్చి చెప్పారు.

 

Also Read: ఆరూరి రమేష్‌ తిరిగి కారెక్కింది అందుకేనా? ఆ మాజీ ఎమ్మెల్యేలో కలవరం దేనికి?