Kurnool Incident: ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్..! ప్రియుడి భార్యకు HIV ఇంజక్షన్..! మాజీ ప్రియురాలి ఘాతుకం..!
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు నర్సు వసుంధరతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Kurnool Incident Representative Image (Image Credit To Original Source)
- ప్రియుడి భార్యను చంపేందుకు సినిమా రేంజ్ లో స్కెచ్
- తానే యాక్సిడెంట్ చేయించిన మాజీ ప్రియురాలు
- సాయం పేరుతో ప్రియుడి భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఎక్కించే ప్రయత్నం
Kurnool Incident: రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్ కు ఆమె తండ్రి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇస్తాడు. ప్రేమించిన వాడిని మర్చిపోకపోవడంతో కూతురిని చంపేయాలని కన్నతండ్రే ఇలా చేస్తాడు. ఇప్పుడు ఏపీలో అచ్చం అలాంటి సీన్ రిపీట్ అయింది. ఈ దారుణం కర్నూలులో జరిగింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే అసూయతో ప్రియుడి భార్యను చంపేందుకు ఘాతుకానికి ఒడిగట్టింది మాజీ ప్రియురాలు. ఆమెకు హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ చేసింది. ఇందుకోసం సినిమా రేంజ్ లో స్కెచ్ వేసింది. తనే యాక్సిడెంట్ చేయించింది. ఆ తర్వాత సాయం చేస్తున్నట్లు డ్రామాలు ఆడి హెచ్ఐవీ వైరస్ ఎక్కించింది.
జనవరి 9న మధ్యాహ్నం ఓ లేడీ డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి.. ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. దీంతో లేడీ డాక్టర్ కింద పడిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి పరుగున అక్కడికి వచ్చారు. కింద పడిపోయిన డాక్టర్ కి సాయం చేస్తున్నట్లు నటించారు. ఆటోలో ఎక్కిస్తామని చెప్పి మాటల్లో పెట్టి.. సదరు మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్ చేశారు.
వారి చర్యలతో భయపడిన లేడీ డాక్టర్ గట్టిగా కేకలు వేసింది. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే సదరు డాక్టర్ దీని గురించి తన భర్తకు సమాచారం ఇచ్చింది. ఆమెపై విష ప్రయోగం జరిగి ఉంటుందని భావించిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా మాజీ ప్రియురాలి పనే అని తేల్చారు పోలీసులు. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రియుడి భార్యని లేపేసేందుకు మాజీ ప్రియురాలు హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ చేసిందని పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు నర్సు వసుంధరతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్రలో సహకరించిన ఇతర నర్సులపై కూడా చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు.
Also Read: ప్రియుడి మీద కోపంతో అతడి ఇంటి మీద పెట్రోల్ పోసి తగలెట్టిన యువతి.. అతడి భార్య, పిల్లలు పాపం..
