Guntur District : వివాహేతర సంబంధం.. రెచ్చిపోయిన ప్రియురాలు.. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో.. దారుణ ఘటన
Guntur District : యువతితో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల ప్రాణాలమీదకు తెచ్చింది. తృటిలో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకొని గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Guntur district
- గుంటూరు జిల్లాలో ఘోరం
- వివాహేతర సంబంధంలో వివాదం
- ప్రియుడి కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు
- గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
Guntur District : యువతితో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల ప్రాణాలమీదకు తెచ్చింది. తృటిలో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకొని గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన అలంకుంట మల్లేశ్ కు, తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గ అనే యువతికి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అప్పటికే దుర్గకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై శనివారం తెనాలిలో పంచాయతీ పెట్టారు. అయితే, రాజీ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన దుర్గ పెట్రోలు క్యాన్ తో సుద్దపల్లిలోని మల్లేశ్ ఇంటికి వెళ్లింది.
మల్లేశ్ భార్య అర్చనతో వివాదానికి దిగింది. ఆ తరువాత మల్లేశ్ భార్య, కుమారుడు అరుణ్, మల్లేశ్ తల్లి పద్మలపై తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను పోసింది.. ఇంటి మీదకూడా పెట్రోల్ చల్లి నిప్పంటించింది. ఈ సమయంలో దర్గపై కూడా పెట్రోల్ పడడంతో ఆమెతోపాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
