Apple iPhone 14 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే? ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Apple iPhone 14 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) ఎల్లో వేరియంట్‌పై అదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ తక్కువ ధరకు పొందాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.

Apple iPhone 14 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే? ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

New iPhone 14 Yellow variant (Photo : Google/Twitter)

Apple iPhone 14 Discount on Flipkart : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) గత నెలలో భారత మార్కెట్లో ఐఫోన్ 14 ఎల్లో కలర్ (iPhone 14 Yellow Edition) ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ ఇండియా (Apple India) వెబ్‌సైట్‌లో ఐఫోన్ మోడల్ (MRP) ధరకే విక్రయిస్తోంది. ప్రస్తుతం, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

iPhone 14 (Yellow) తాత్కాలిక డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఐఫోన్ 14 ధర రూ. 71,999 (128GB)గా ఉంది. అంటే.. అసలు ధర రూ. 79,999 నుంచి తగ్గింది. మీరు HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. అదనంగా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది.

అదే ఆఫర్ కింద.. 256GB స్టోరేజ్ ఆప్షన్‌కు వర్తిస్తుంది. ఆపిల్ కస్టమర్‌లు ఈ ఐఫోన్ 14ను రూ.77,999కి కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ ఇండియా ఇ-స్టోర్‌లో iPhone 14 ఎల్లో వేరియంట్ 128GB ఆప్షన్ కన్నా తక్కువ ధరకు వినియోగదారులు (Flipkart Sale)లో 256GB వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

Read Also : Apple iPhone SE 4 Price : గూగుల్ పిక్సెల్ 7aకు పోటీగా.. అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ SE 4 వస్తోంది..!

ఒకవేళ HDFC బ్యాంక్ కార్డ్ లేకపోతే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ (Flipkart Axis Bank Card) ఉన్న యూజర్లు 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌పై డీల్ పొందాలంటే.. మీరు ట్రేడ్-ఇన్ ఆఫర్‌ (Trade-in Offer)ను కూడా ఎంచుకోవచ్చు. సాధారణంగా, పాత iPhones రీసేల్ వాల్యూ వాటి Android ఇతర పోటీదారుల కన్నా ఎక్కువగా ఉంటుంది.

New iPhone 14 Yellow variant already available with Rs 12000 discount on Flipkart

Apple iPhone 14 Discount Yellow variant (Photo : Google/Twitter)

ఎల్లో ఐఫోన్ 14 వద్దంటే.. మరో 5 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. HDFC బ్యాంక్ ఆఫర్‌తో.. iPhone 14 బ్లాక్, బ్లూ, వైట్, పర్పల్ కలర్ వేరియంట్‌లు వరుసగా రూ. 67,999కి అందుబాటులో ఉన్నాయి. రెడ్ వేరియంట్ రూ.66,999కి విక్రయిస్తోంది. ఆపిల్ iPhone 14 Plus ఎల్లో ఎడిషన్‌తో కూడా అందుబాటులో ఉంది. అయితే, ఫ్లిప్ కార్ట్‌లో ఈ డివైజ్ అందుబాటులో లేదు. ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో, బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.89,900 నుంచి ప్రారంభం అవుతుంది.

256GB ఆప్షన్ ధర రూ. 99,900, టాప్ 512GB మోడల్ ధర రూ. 1,19,900గా ఉన్నాయి. గత ఏడాది నుంచి ఐఫోన్‌లు (మార్చి) ప్రారంభంలో కొత్త కలర్ ఆప్షన్ అందిస్తున్నాయి. గత ఏడాదిలో కంపెనీ ఐఫోన్ 13 Pro, Pro Maxలను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 13 Pro, ఐఫోన్ 13 Pro Max ఆల్పైన్ గ్రీన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.

కొత్త కలర్ ఆప్షన్‌తో ఐఫోన్ 14 లాంచ్ చేసిన తర్వాత యూజర్లకు మరిన్ని కలర్ ఆప్షన్లను అందిస్తుంది. గత ఏడాదిలా కాకుండా, సాధారణ మోడల్స్ iPhone 14, iPhone 14 Plus మాత్రమే ఎల్లో వేరియంట్‌తో వచ్చాయి. iPhone 14 Pro, 14 Pro Max ఇప్పటికీ పర్పల్, గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇక, బేస్ 14 Pro ధర రూ. 1,29,900 నుంచి ప్రారంభమైంది. ఐపోన్ 14 Pro Max ప్రారంభ ధర రూ. 1,39,900 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : iPhone 13 Price Offer : ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!