Apple iPhone SE 4 Price : గూగుల్ పిక్సెల్ 7aకు పోటీగా.. అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ SE 4 వస్తోంది..!

Apple iPhone SE 4 Price : కొత్త ఐఫోన్ (iphone) కొనేందుకు చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 7a (Google Pixel 7a)కు పోటీగా అత్యంత సరసమైన ధరకే ఆపిల ఐఫోన్ (iPhone SE 4) రాబోతోంది. ఇంతకీ ధర ఎంత ఉండొచ్చు తెలుసా?

Apple iPhone SE 4 Price : గూగుల్ పిక్సెల్ 7aకు పోటీగా.. అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ SE 4 వస్తోంది..!

Apple iPhone SE 4 Price _ Apple to bring affordable iPhone SE 4, may compete with Google Pixel 7a

Apple iPhone SE 4 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే ఏడాది 2024లో (Apple) నుంచి (iPhone SE 4) లాంచ్ చేయనుంది. అయితే,ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే అనేక ఫీచర్లను రివీల్ చేసింది. (Mashable) వెబ్‌సైట్ ప్రకారం.. రాబోయే ఐఫోన్ SE మోడల్ ప్రీమియం ఐఫోన్ సిరీస్‌కు తక్కువ ఖర్చుతో రావొచ్చు. అంతకంటే ముందు లాంచ్ అయిన (iPhone SE 2022) మాదిరిగా తక్కువ ధరకే రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్‌కమింగ్ (Google Pixel 7a)తో పోటీగా రానుందని నివేదిక తెలిపింది. కొన్ని ఆన్‌లైన్ నివేదికల ప్రకారం.. అమెరికాలో ఆపిల్ ఐఫోన్ 15 Pro ధర రాబోయే రోజుల్లో పెరగవచ్చు. అదే జరిగితే, ఐఫోన్ లాంచ్ తర్వాత (iPhone 15 Pro) ధర పెరగడం ఇదే మొదటిసారి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ.. మీరు కొత్త (iPhone)ని కోరుకుంటే.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఐఫోన్ SE 4 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 33,775లతో రావొచ్చు.

Apple iPhone SE 4 Price _ Apple to bring affordable iPhone SE 4, may compete with Google Pixel 7a

Apple iPhone SE 4 Price : Apple to bring affordable iPhone SE 4, compete with Google Pixel 7a

Read Also : Apple Watch Blood Glucose Feature : రాబోయే రోజుల్లో ఆపిల్ వాచ్‌తోనే షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు..? బ్లడ్ శాంపిల్ అక్కర్లేదు..!

నివేదికల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ SE 4 చిన్న, iPhone 8 డిజైన్, భారీ, 6.1-అంగుళాల BOE OLED డిస్‌ప్లేతో రానుందని అంచనా. ఆపిల్ (iPhone SE 3) ఫోన్ 4.7-అంగుళాల స్క్రీన్‌తో రానుంది. ఈ కొత్త iPhone SE 4 సైజులో iPhone 13, ఆపిల్ iPhone 14 మాదిరిగా ఉండవచ్చు. గత వెర్షన్ కన్నా నాచ్ డిజైన్, సన్నని బెజెల్‌లను కలిగి ఉంటుంది. Mashable ప్రకారం.. ఐఫోన్ SE 4 Face IDకి సపోర్టుగా టచ్ ID లేకుండా రానుందని అంచనా.

అదనంగా, ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ 2019లో ఐఫోన్ 14 Pro మోడల్‌ల నుంచి A16 బయోనిక్ CPUతో రానుందని పేర్కొంది. 2024 నాటికి, భారత్ సహా మరిన్ని ప్రాంతాలలో 5G నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఆపిల్ ఐఫోన్ SE 4 5Gకి కూడా సపోర్టుతో రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఆపిల్ iPhone SE 3 5G సపోర్ట్‌ను కూడా అందించనుంది.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. రాబోయే 2023 మోడల్‌లో 5 సరికొత్త ఫీచర్లు ఇవే..!