Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. రాబోయే 2023 మోడల్‌లో 5 సరికొత్త ఫీచర్లు ఇవే..!

Apple iPhone 15 : ఈ ఏడాదిలో ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 2023 మోడల్ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 15 పేరుతో ఈ కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాదిలో iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో కొన్ని ఫీచర్లలో అనేక మార్పులతో వచ్చాయి.

Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. రాబోయే 2023 మోడల్‌లో 5 సరికొత్త ఫీచర్లు ఇవే..!

iPhone 15 launching this year _ 5 features we want to see in the 2023 model

Apple iPhone 15 : ఈ ఏడాదిలో ఆపిల్ (Apple) నుంచి సరికొత్త ఐఫోన్ 2023 మోడల్ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) పేరుతో ఈ కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాదిలో ఆపిల్ iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో కొన్ని ఫీచర్లలో అనేక మార్పులతో వచ్చాయి. అప్‌గ్రేడ్ 48-MP ప్రైమరీ కెమెరా, డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్, ఫాన్సీ డైనమిక్ ఐలాండ్ కూడా ఉన్నాయి. కానీ, ఆపిల్ iPhone 14 చిన్న మార్పులతో వచ్చింది.

ముఖ్యంగా స్పెసిఫికేషన్ వారీగా చూస్తే.. నాన్-ప్రో స్టాండర్డ్ మోడల్‌తో రానుంది. అత్యధికంగా సేల్ అయ్యే బేస్ మోడల్ కూడా. ఆపిల్ ఎక్కువగా సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేస్తుంది. ఈసారి కూడా iPhone 15 సిరీస్ 2023 తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ యూజర్లు అత్యంతగా ఇష్టపడే రాబోయే iPhone 15లో 5 సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

డైనమిక్ ఐలాండ్ (Dynamic Island) :
ఐఫోన్ 14 ప్రో మోడల్‌లలో అతిపెద్ద ఫీచర్ డైనమిక్ ఐలాండ్. పిల్ ఆకారపు కటౌట్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, మ్యాప్స్, ఇతర నోటిఫికేషన్‌లను చూపిస్తుంది. కానీ, టాప్ మోడల్స్ iPhone 14 Pro, iPhone 14 Pro Max మాత్రమే. డైనమిక్ ఐలాండ్‌ను పొందాయి. సాధారణ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లు అదే పాత నాచ్ డిస్‌ప్లేతో మిగిలిపోయాయి. ఈసారి, Apple సొంత iPhone 15తో ప్రారంభించి.. అన్ని iPhone 15 సిరీస్ మోడల్‌లకు డైనమిక్ ఐలాండ్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

iPhone 15 launching this year _ 5 features we want to see in the 2023 model

iPhone 15 launching this year _ 5 features we want to see in the 2023 model

టైప్-C ఛార్జింగ్ (Type-C charging) :
ఐఫోన్‌లలో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ రానుంది. వేర్వేరు ఫోన్‌లకు వేర్వేరు ఛార్జర్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 2023లో కనీసం iPhone 15 సిరీస్‌లో USB-C పోర్ట్‌ని పొందవచ్చు. ఇదే జరిగితే. ఐఫోన్లలో పెద్ద మార్పు కానుంది. అన్ని లైటనింగ్ పోర్టు వైరులు ఇకపై ఎవరికీ కనిపించవు.

Read Also : Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ iPhone 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనాలా? వద్దా?

అప్‌గ్రేడ్ డిజైన్ (Upgraded design) :
మీరు iPhone 12, iPhone 13, iPhone 14లను పరిశీలిస్తే.. అవన్నీ ఒకేలా కనిపిస్తాయి. కెమెరా ప్లేస్‌మెంట్, నాచ్ సైజు మాత్రమే తేడా ఉంటుంది. ఐఫోన్ 15తో, ఆపిల్ డిజైన్ మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్ కొన్ని లీకైన ఫొటోలు చూస్తే.. డిజైన్ అలాగే ఉండే అవకాశం ఉంది. కానీ, ఐఫోన్‌ల ధరలు ప్రతి ఏడాదిలో పెరుగుతున్నాయి. ఐఫోన్‌లు రిఫ్రెష్డ్ డిజైన్‌తో రావొచ్చు. డిజైన్ కాకపోతే, కనీసం కొన్ని కొత్త కలర్లతో వచ్చే అవకాశం ఉంది.

iPhone 15 launching this year _ 5 features we want to see in the 2023 model

iPhone 15 launching this year _ 5 features we want to see in the 2023 model

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (Fast Charging Support) :
ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్నాయి. Realme ఇటీవల 240W ఛార్జింగ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. Xiaomi 5 నిమిషాల్లో ఫోన్ బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేసే 300W ఛార్జర్‌ను ప్రవేశపెట్టింది. కానీ, పాత ఐఫోన్‌లు ఇప్పటికీ 20W నుంచి 27W ఛార్జింగ్ స్పీడ్ మధ్య నిలిచిపోయాయి. అతిపెద్ద iPhone 14 Pro Max మోడల్ కూడా 27W ఛార్జింగ్ స్పీడ్‌ని మించదు. ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోల్చినప్పుడు ఐఫోన్లు చాలా నెమ్మదిగా ఉంటాయి. ఐఫోన్ 15 సిరీస్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని పొందవచ్చు.

ఫింగర్‌ప్రింట్ స్కానర్ (Fingerprint Scanner) :
ఐఫోన్లలో ఫింగర్ ఫ్రింట్ స్కానర్. ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ కన్నా వేగంగా సులభంగా ఉంటాయి. పాత iPhone మోడల్‌లు టచ్ IDతో హోమ్ బటన్‌తో వచ్చేవి. కానీ, ఇప్పుడు ఆధునిక iPhoneలలో హోమ్ బటన్‌లు లేవు, ఫింగర్‌ప్రింట్ రీడర్ లేదు. iPhone 15 సిరీస్‌తో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో రానున్నాయి. అన్ని ఫీచర్లతో పాటు ఐఫోన్ 15 మోడల్ టైప్-C పోర్ట్‌లతో రానున్నాయి. రాబోయే iPhone 15 సిరీస్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

Read Also : Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. సింగిల్ ఛార్జ్‌తో 52 రోజులు వస్తుంది.. ధర కేవలం రూ.14వేలు మాత్రమే!