Naveen Reddy Arrest : ఎట్టకేలకు దొరికాడు.. గోవాలో బీచ్ దగ్గర నవీన్‌ రెడ్డి అరెస్ట్, ఆదిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో పురోగతి

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ఘటన తర్వాత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న నవీన్ ను గోవాలోని బీచ్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.

Naveen Reddy Arrest : ఎట్టకేలకు దొరికాడు.. గోవాలో బీచ్ దగ్గర నవీన్‌ రెడ్డి అరెస్ట్, ఆదిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో పురోగతి

Naveen Reddy Arrest : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. గోవాలో నక్కిన నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నవీన్ రెడ్డి గోవాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. కాండోలిమ్ బీచ్ దగ్గర అతడిని అరెస్ట్ చేశారు.

కిడ్నాప్ ఘటన తర్వాత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని బీచ్ దగ్గర నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నవీన్ రెడ్డి కోసం ప్రత్యేక పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో నవీన్ గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఓ బీచ్ దగ్గర అతడిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read..Miyapur Lover Attack : క్రైమ్ స్టోరీగా మారిన రేపల్లె లవ్ స్టోరీ.. మియాపూర్‌లో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

నవీన్ రెడ్డిని గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. వైశాలిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నవీన్ రెడ్డి కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 9న 40మంది యువకులతో వెళ్లి వైశాలి ఇంటిపై దాడిన చేసి వైశాలిని కిడ్నాప్ చేశాడు నవీన్ రెడ్డి. ఈ ఘటన సంచలనం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కిడ్నాప్ చేసిన గంటల వ్యవధిలోనే వైశాలిని కాపాడారు. తాజాగా నవీన్ రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు.

డిసెంబర్‌ 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలి ఇంటికి వెళ్లిన నవీన్.. నానా బీభత్సం సృష్టించాడు. వైశాలి ఇంటిపై దాడి చేశాడు. ఆమె తల్లిదండ్రులను, బంధువులను కొట్టాడు. వైశాలిని కిడ్నాప్‌ చేశాడు. వైశాలిని కిడ్నాప్‌ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లాడు. అయితే,, తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయం తెలిసి నవీన్‌ రెడ్డి, అతడి అనుచరులు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు.

Also Read..Vaishali Kidnap Remand Report : పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్.. వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

పోలీసులు గాలింపు ముమ్మరం చేసే సరికి నవీన్ రెడ్డి పరార్ అయ్యాడు. నవీన్ స్నేహితుడు.. వైశాలిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చాడు. పోలీసులు యువతిని కాపాడి ఇంటికి తీసుకెళ్లారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ముమ్మరంగా దర్యాఫ్తు చేపట్టారు.

ఇక నవీన్ రెడ్డి పై లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు నవీన్ రెడ్డి మహాముదురు అని గుర్తించారు. నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెడతామన్న పోలీసులు.. పాత కేసులను తిరిగి తోడుతున్నారు. నవీన్ నేరచరిత్ర గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వరంగల్, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో నవీన్ రెడ్డి పై నమోదైన కేసులు వెలుగుచూశాయి. ఇంకా నవీన్ రెడ్డిపై ఎక్కడెక్కడ ఏయే కేసులు ఉన్నాయన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.