Miyapur Lover Attack : క్రైమ్ స్టోరీగా మారిన రేపల్లె లవ్ స్టోరీ.. మియాపూర్‌లో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

Miyapur Lover Attack : క్రైమ్ స్టోరీగా మారిన రేపల్లె లవ్ స్టోరీ.. మియాపూర్‌లో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

Miyapur Lover Attack : ప్రేమ పేరుతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించలేదని కోపంతో అమ్మాయిలపై దాడులకు తెగబడుతున్నారు. వారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు ప్రేమోన్మాదులు. తాజాగా హైదరాబాద్ మియాపూర్ లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. యువతి గొంతు కోశాడు.

మియాపూర్ ఆదిత్య నగర్ లో సందీప్ అనే యువకుడు రెచ్చిపోయాడు. యువతి గొంతు కోశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లిపైనా అతడు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తను కూడా గొంతు కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని, ఆమె తల్లిని కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సందీప్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే గొడవకు కారణం అని పోలీసులు తెలిపారు.

Also Read..Adibatla Kidnap Case : ప్రేమా లేదు పెళ్లీ లేదు, వాడసలు మనిషే కాదు, నవీన్ రెడ్డి నా కెరీర్ నాశనం చేశాడు- ఆదిభట్ల కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్

యువతి, యువకులు ఇద్దరిదీ గుంటూరు జిల్లా రేపల్లె. యువతి వైభవి (19), సందీప్ గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఇద్దరికీ నిశ్చాతార్థం కూడా జరిగింది. అయితే, సడెన్ గా కథ మారిపోయింది. ఏం జరిగిందో కానీ.. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. పెద్దల సమక్షంలో విడిపోయారు. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. వైభవి తన తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చేసింది. గత 8 నెలలుగా మియాపూర్ లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో వైభవికి మరో అబ్బాయితో పెళ్లి నిర్ణయించారు. ఈ విషయం సందీప్ కి తెలిసింది. అంతే సందీప్ కోపంతో ఊగిపోయాడు. వైభవికి ఫోన్ చేశాడు. పెళ్లి చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఊరుకోలేదు. ఏకంగా రేపల్లె నుంచి హైదరాబాద్ వచ్చాడు.

నేరుగా మియాపూర్ లోని వైభవి ఇంటికి వెళ్లాడు. గంటసేపు వైభవి, ఆమె తల్లితో మాట్లాడాడు. వైభవిని తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో వైభవిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లిపైనా కత్తితో దాడి చేశాడు సందీప్. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

Also Read..Nizamabad Srikanth : 80రోజుల క్రితం అదృశ్యం, చెట్టుకు వేలాడుతున్న శ్రీకాంత్ మృతదేహం.. అసలేం జరిగింది?

లోతైన గాయం కావడంతో సందీప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు సందీప్.

వైభవికి మరొకరితో పెళ్లి చేస్తున్నారని తెలిసి సందీప్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? తనకు దక్కని వైభవి మరొకరికి దక్కొద్దనే ఉన్మాదంతో ఈ దారుణానికి ఒడిగట్టాడా? అసలేం జరిగింది? ఇలా అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.