Adibatla Kidnap Case : ప్రేమా లేదు పెళ్లీ లేదు, వాడసలు మనిషే కాదు, నవీన్ రెడ్డి నా కెరీర్ నాశనం చేశాడు- ఆదిభట్ల కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్

ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వైశాలి కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. కిడ్నాప్ కు గురైన యువతి వైశాలి మీడియా ముందుకొచ్చింది. సంచలన విషయాలు చెప్పింది. నవీన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది.

Adibatla Kidnap Case : ప్రేమా లేదు పెళ్లీ లేదు, వాడసలు మనిషే కాదు, నవీన్ రెడ్డి నా కెరీర్ నాశనం చేశాడు- ఆదిభట్ల కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్

Adibatla Kidnap Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వైశాలి కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. కిడ్నాప్ కు గురైన యువతి వైశాలి మీడియా ముందుకొచ్చింది. సంచలన విషయాలు చెప్పింది. నవీన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది. నవీన్ రెడ్డి అంటున్నట్లుగా.. తమ మధ్య ప్రేమా లేదు పెళ్లీ లేదని వైశాలి తేల్చి చెప్పింది. నవీన్ రెడ్డి తన కెరీర్ ను నాశనం చేశాడని కన్నీటిపర్యంతం అయ్యింది.

మీడియా ముందుకొచ్చిన యువతి వైశాలి తన గోడు వెళ్లబోసుకుంది. నవీన్ రెడ్డి తనను కిడ్నాప్ చేసి హింసించాడని తెలిపింది. తనను దారుణంగా కొట్టాడని వాపోయింది. తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా.. హెల్ప్ అని అరిచినందుకు గోళ్లతో గిచ్చారని, పళ్లతో కొరికారని వైశాలి ఆవేదన వ్యక్తం చేసింది. కారులో తనపై కిరాతకంగా దాడి చేశారని చెప్పింది.

Also Read..Adibatla Kidnap Case : 100మందితో వచ్చి యువతి కిడ్నాప్ కేసు.. అమ్మాయి సేఫ్, కిడ్నాపర్ అరెస్ట్

నవీన్ రెడ్డితో తనకు పెళ్లి కాలేదని వైశాలి చెప్పింది. నవీన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించింది. నవీన్ రెడ్డి చూపించిన ఫొటోలు మార్ఫింగ్ అని చెప్పింది. నవీన్ రెడ్డి తన కెరీర్ ను నాశనం చేశాడని వాపోయింది. తనతో కలిసి నవీన్ రెడ్డి బ్యాడ్మింటన్ ఆడేవాడని, అతడితో ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని చెప్పింది వైశాలి. నువ్వంటే ఇష్టం లేదని నవీన్ రెడ్డితో చెప్పినప్పటికీ.. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదంటూ నవీన్ రెడ్డి తన జట్టు పట్టుకుని కొట్టాడని వైశాలి కన్నీరుపెట్టుకుంది.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అసలేం జరిగింది?

”నవీన్ నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాడు. నన్ను చాలా ఘోరంగా కొట్టాడు. నా కెరీర్ ను నాశనం చేశాడు. కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు, పళ్లతో కొరికారు. ఇష్టం లేదని చెబుతున్నా వినిపించుకోలేదు. మాతో కలిసి నవీన్ బ్యాడ్మింటన్ ఆడేవాడు. నవీన్ తో నాకు ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది. ప్రస్తుతం నా గాయాలకు చికిత్స తీసుకుంటున్నా. వాడసలు మనిషే కాడు. పోలీసులు నాకు భద్రత కల్పించాలి. నవీన్ తో అసలు నా పెళ్లి జరగలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెబుతున్నా నీ ఇష్టంతో నాకు సంబంధం లేదన్నాడు. నా జట్టు పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నవీన్ రెడ్డి చూపించిన ఫొటోలు మార్ఫింగ్ వి” అని వైశాలి వాపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.