Adibatla Kidnap Case : 100మందితో వచ్చి యువతి కిడ్నాప్ కేసు.. అమ్మాయి సేఫ్, కిడ్నాపర్ అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన యువతి సేఫ్ గా ఉంది. పోలీసులు వైశాలి ఆచూకీ గుర్తించారు. ఇక యువతిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ నవీన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Adibatla Kidnap Case : 100మందితో వచ్చి యువతి కిడ్నాప్ కేసు.. అమ్మాయి సేఫ్, కిడ్నాపర్ అరెస్ట్

Adibatla Kidnap Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన యువతి సేఫ్ గా ఉంది. పోలీసులు వైశాలి ఆచూకీ గుర్తించారు. ఇక యువతిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ నవీన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిని రక్షించిన పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్తున్నారు.

వైశాలి తన తండ్రి దామోదర్ కు ఫోన్ చేసింది. తాను సేఫ్ గానే ఉన్నానని, తన గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది. మన్నెగూడలోనే తాను ఉన్నట్లు ఆ యువతి తండ్రితో చెప్పింది. దీంతో తండ్రి దామోదర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఉన్న లొకేషన్ ను ట్రేసౌట్ చేశారు. కాగా, ఈ మధ్యాహ్నం నవీన్ రెడ్డి అనే యువకుడు సినిమా స్టైల్ లో 100మందితో కలిసి వచ్చి.. ఇంట్లో ఉన్న వైశాలిని కిడ్నాప్ చేయడం తీవ్ర సంచలనం రేపింది.

అసలేం జరిగిందంటే..
రాగన్నగూడకు చెందిన వైశాలి బీడీఎస్‌ పూర్తి చేసింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా.. నవీన్‌ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి వైశాలి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం వైశాలిని బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సినిమా స్టైల్ లో ఈ కిడ్నాప్ జరిగింది. యువ‌తి ఇంటిపై 100 మంది యువకులు దాడి చేశారు. అడ్డువచ్చిన యువతి త‌ల్లిదండ్రుల‌ను, చుట్టుపక్కల వారిని చిత‌క‌బాదారు. యువతి ఇంటిని ధ్వంసం చేసి, ఆ యువ‌తిని ఎత్తుకెళ్లారు. అప్ర‌మత్త‌మైన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అంత‌లోపే యువ‌కులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.

న‌వీన్ రెడ్డి.. వైశాలిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. వైశాలిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఐదారు నెలలుగా తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు  యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు. మధ్యవర్తుల ద్వారా కూడా యువతి తల్లిదండ్రులను పెళ్లి సంబంధం గురించి అడిగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఈ సంబంధం తమకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. ఇది మనసులో పెట్టుకుని నవీన్‌ ఈ కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.

Also Read..Adibatla Kidnap Case : 100మందితో వచ్చి యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్, తండ్రికి ఫోన్ చేసిన కూతురు

పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న నవీన్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమ కూతురును నవీన్‌ రెడ్డి అనే యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడని షీ టీమ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు యువతి తండ్రి తెలిపారు.

శుక్రవారం యువ‌తిని చూసేందుకు పెళ్లి వారు వ‌స్తున్నార‌న్న విష‌యం న‌వీన్ రెడ్డికి తెలిసింది. దీంతో ఈ పెళ్లి సంబంధం చెడ‌గొట్టాల‌నే అక్క‌సుతో ఏకంగా 100 మంది యువ‌కుల‌ను న‌వీన్ రెడ్డి వెంటేసుకుని వ‌చ్చాడని యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు. యువ‌తి ఇంట్లోకి ప్ర‌వేశించి వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. అనంత‌రం ఆమెను బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డువ‌చ్చిన త‌ల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారిపై కూడా దాడి చేశారు.

Also Read..100 Gang Kidnapped Woman : 100మందితో వచ్చి సినిమా స్టైల్లో యువతిని కిడ్నాప్..