Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అసలేం జరిగింది?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రేమ పేరుతో అబ్బాయి వేధిస్తున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. మా వాడిని వాడుకుని వదిలేశారని అబ్బాయి తల్లి ఆరోపిస్తోంది.(Adibatla Kidnap Case)

Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అసలేం జరిగింది?

Adibatla Kidnap Case : ఆదిభట్లలో 100 మందితో వచ్చిన ఓ యువకుడు.. యువతి ఇంటిపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఈ కిడ్నాప్ కేసులో అమ్మాయి తల్లిదండ్రులది ఒక వెర్షన్ కాగా అబ్బాయి తల్లిది మరో వెర్షన్. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో నవీన్ రెడ్డి వేధించాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తుంటే.. పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి యువతి కుటుంబసభ్యులు మోసం చేశారని నవీన్ రెడ్డి తల్లి వాపోతున్నారు. దీంతో ఈ కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది. ఎవరు నిజం చెబుతున్నారో పోలీసులకు అంతుచిక్కడం లేదు.

Also Read..Adibatla Kidnap Case : 100 మందితో వచ్చి యువతి కిడ్నాప్ కేసు.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు

”మా పిల్లను లవ్ చేశాను అని చెప్పుకుని తిరిగాడు. నవీన్ రెడ్డిని మా దగ్గరికి రాకుండా ఏదో ఒకటి చేయాలి. జైలు పాలు చేయాలి. ఇంత అరాచకం చేస్తుంటే కూడా ఒక్క పోలీసు కూడా పట్టించుకోకపోవడం దారుణం. నాలుగు నెలల నుంచి నవీన్ రెడ్డి టార్చర్ పెడుతున్నాడు. ఇంటి ముందు టెంట్ వేశాడు. అరాచకం చేశాడు. నవీర్ రెడ్డి మా దగ్గరికి రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్” అని యువతి తండ్రి దామోదర్ రెడ్డి చెప్పారు.

”నా కొడుకు నవీన్ నిన్న చేసింది కరెక్ట్ కాదు. నేను ఒప్పుకుంటున్నా. మా అబ్బాయి ఇలా కావడానికి కారణం వాళ్లే. కార్లలో తిప్పించుకున్నారు. కాలేజీ దగ్గరికి పంపించారు. కరోనా టైమ్ లో బస్సులు లేకపోతే నా కొడుకే ఆ పిల్లలను తీసుకెళ్లేవాడు. కారు కొని కారులో తిప్పాడు. బట్టలు కొనిచ్చుకుంది. షాపింగ్ లు కూడా చేశారు. పెళ్లి అయిన వాళ్లు ఎలా తిరిగారో అలా తిరిగారు ఇద్దరూ.

Also Read..Adibatla Kidnap Case : 100మందితో వచ్చి యువతి కిడ్నాప్ కేసు.. అమ్మాయి సేఫ్, కిడ్నాపర్ అరెస్ట్

అమ్మాయిని మా కొడుక్కి ఇస్తామని కూడా చెప్పారు. పరీక్షలు అయిపోయాక ఎంగేజ్ మెంట్ అని యువతి తల్లిదండ్రులు చెప్పారు. ఇంతలో ఏం జరిగిందో తెలీదు. నా కొడుకు ఇంత గొడవ చేస్తున్నాడని యువతి తల్లిదండ్రులు ఒక్కసారి కూడా మాతో చెప్పలేదు. ఎన్నడూ మమ్మల్ని అడగలేదు. నా కొడుకు తప్పు చేసుంటే నాకు చెప్పాలి కదా? ఎందుకు చెప్పలేదు. నా కొడుకుతో పెళ్లి చేశాక మరో యువకుడితో పెళ్లి చేయాలని చూడటం కరెక్టేనా? ” అని నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ వాపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తాను ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడే కిడ్నాప్ చేశాడు. వంద మంది యువకులతో వచ్చిన నవీన్ రెడ్డి యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లిపోయాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు మన్నెగూడలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై యువతి తండ్రి దామోదర్‌రెడ్డి ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్‌ రెడ్డి, అతని అనుచరులపై ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, కిడ్నాప్, దాడితో పాటు పలు కేసులు నమోదు చేశారు.

‘‘బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో నా కుమార్తెకు నవీన్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో రెండేళ్లుగా నా కుమార్తెను వేధించాడు. నిన్న నవీన్‌ రెడ్డి, రూబెన్‌, మరో 50 మంది అనుచరులు నా ఇంటిపై దాడి చేశారు. కారులో ఐరన్‌ రాడ్లు, రాళ్లు తీసుకొని ఇంటికి వచ్చారు. నా కూతురు, మా కుటుంబసభ్యులను చంపాలని ఇంట్లోకి దూసుకొచ్చారు. నా కూమార్తె విషయంలో మొదటి నుంచి నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించాడు.

తనను సొంతం చేసుకోవాలని ఎన్నో డ్రామాలు ఆడాడు. నా కుమార్తెతో వివాహం జరిగినట్లు నమ్మించేందుకు ఎన్నో కుట్రలు చేశాడు. ఈ మేరకు గతేడాది ఆగస్టు 27న నా కుమార్తెతో వివాహమైందని ప్రచారం చేసుకున్నాడు. నా భార్యను పంపించడం లేదంటూ ఎల్బీనగర్ కోర్టులో నవీన్‌రెడ్డి పిటిషన్ వేశాడు. ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినీగా భార్య పేరు స్థానంలో నా కుమార్తె పేరు రాయించుకున్నాడు. ఆ పత్రాలను ఆధారంగా చూపించి కోర్టులో పిటిషన్ వేశాడు. ఆగస్టు 27న అనారోగ్యం కారణంగా నా కుమార్తె ఆస్పత్రిలో ఉంది. నా కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందిన బిల్లులే ఇందుకు నిదర్శనం. నా కూతురుతో కలిసి దిగిన ఫొటోలను నవీన్ రెడ్డి పెళ్లి ప్రచారానికి వాడుకున్నాడు’’ అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.