Nizamabad Srikanth : 80రోజుల క్రితం అదృశ్యం, చెట్టుకు వేలాడుతున్న శ్రీకాంత్ మృతదేహం.. అసలేం జరిగింది?
నిజామాబాద్ జిల్లా ఖండ్ ఘావ్ కు చెందిన శ్రీకాంత్ 80 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ప్రేమ వ్యవహారంలో కనిపించకుండా పోయాడు. అయితే, బోధన్ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం చెట్టుకి వేలాడుతూ ఉంది.

Nizamabad Srikanth : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ ఘావ్ గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ ను అత్యంత దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీకాంత్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు కూడా నిందితులతో చేతులు కలిపి తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ ను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారికి సహకరించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఖండ్ ఘావ్ కు చెందిన శ్రీకాంత్ 80 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ప్రేమ వ్యవహారంలో కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతడి కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెతుకుతూనే ఉన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే, బోధన్ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం చెట్టుకి వేలాడుతూ ఉంది. స్పాట్ లో లభించిన ఆధారాలను బట్టి మృతుడు శ్రీకాంత్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు స్పాట్ కి చేరుకుని ఆందోళన చేపట్టారు. యువతి బంధువులే శ్రీకాంత్ ను చంపారని ఆరోపించారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ప్రేమ వ్యవహారంలో శ్రీకాంత్ ను యువతి కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారని తాము ఫిర్యాదు చేసినా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని శ్రీకాంత్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని కుటుంబసభ్యులు అంటున్నారు. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటే, ఇప్పటివరకు బాడీ అలా ఉండేది కాదంటున్నారు. శ్రీకాంత్ ను హత్య చేసినట్లుగా ఉందంటున్నారు.
ఆత్మహత్య చేసుకుని ఉంటే 80 రోజులకు డెడ్ బాడీ దొరికేది కాదంటున్నారు. ఒక పొలం పక్కన శ్రీకాంత్ మృతదేహం ఉందన్నారు. ఒక పొలం పక్కన మృతదేహం ఉంటే 80 రోజుల వరకు కనిపించకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే తల ఒక చోట మొండం మరో చోట ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా మర్డర్ అని అంటున్నారు. శ్రీకాంత్ హత్యకు కారణమైన అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు సహకరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని శ్రీకాంత్ కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు.