Vaishali Kidnap Remand Report : పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్.. వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

రాష్ట్రంలో సంచలనం రేపిన ఆదిభట్ల వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. పక్కా స్కెచ్ ప్రకారమే నవీన్ రెడ్డి కిడ్నాప్ కు పాల్పడినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు. వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

Vaishali Kidnap Remand Report : పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్.. వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Vaishali Kidnap Remand Report : రాష్ట్రంలో సంచలనం రేపిన ఆదిభట్ల వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. పక్కా స్కెచ్ ప్రకారమే నవీన్ రెడ్డి కిడ్నాప్ కు పాల్పడినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు. వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

”గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్‌ అకాడమీలో యువతికి నవీన్ పరిచయం అయ్యాడు. వైశాలి మొబైల్‌ నెంబర్‌ తీసుకున్న నవీన్‌ రెడ్డి తరుచూ ఆమెకు ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చేశాడు. పరిచయాన్ని అ‍డ్డం పెట్టుకుని వైశాలితో ఫోటోలు కూడా దిగాడు.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి నేరచరిత్రపై ఆరా, గతంలో రెండు కేసులు నమోదు

ఇదే క్రమంలో నవీన్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. తన తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే వివాహం చేసుకుంటానని వైశాలి చెప్పింది. దీంతో వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నించాడు. అయితే వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న నవీన్ రెడ్డి.. వైశాలి పేరుతో ఫేక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. వైశాలితో దిగిన ఫోటోలను అందులో వైరల్‌ చేశాడు.

5 నెలల కిత్రం వైశాలి ఇంటి ముందు స్థలం లీజుకు తీసుకుని అందులో తాత్కాలిక షెడ్డు వేశాడు. ఆగస్టు 31న అక్కడ గణేష్‌ విగ్రహం కూడా ఏర్పాటు చేశాడు. నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్‌ క్రియేట్ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్‌ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్న నవీన్ రెడ్డి.. యువతిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు.

Also Read..Adibatla Kidnap Case : ప్రేమా లేదు పెళ్లీ లేదు, వాడసలు మనిషే కాదు, నవీన్ రెడ్డి నా కెరీర్ నాశనం చేశాడు- ఆదిభట్ల కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్

వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్‌ చేశాడు. తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని కిడ్నాప్ కు వాడుకున్నాడు. ఈ కిడ్నాప్‌లో ఆరుగురు కీలకంగా వ్యవహరించారు. నవీన్‌రెడ్డి, రుమాన్‌, చందూ, సిద్ధూ, సాయినాథ్‌, భాను ప్రకాష్‌తో కలిసి వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్‌ వేశారు. వైశాలితో పాటు చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పథకం రచించారు.

డిసెంబర్‌ 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలి ఇంటికి వచ్చిన నవీన్.. వైశాలిని కిడ్నాప్‌ చేశాడు. యువతి ఇంటిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన యవతి తల్లిదండ్రులపైనా దాడి చేసి బీభత్సం సృష్టించాడు. వైశాలిని కిడ్నాప్‌ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లాడు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయం తెలిసి నవీన్‌ రెడ్డి, అతడి అనుచరులు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేసే సరికి నవీన్ రెడ్డి పరార్ అయ్యాడు. నవీన్ స్నేహితుడు.. వైశాలిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చాడు. పోలీసులు యువతిని కాపాడి ఇంటికి తీసుకెళ్లారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కిడ్నాప్‌ జరిగిన సాయంత్రానికి తాను క్షేమంగా ఉన్నట్లు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది వైశాలి. రాత్రి 8.37 నిమిషాలకు మన్నెగూడలో ఉన్నట్లు చెప్పడంతో పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు.. వైశాలిని ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఈ కేసులో 32 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డి మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు” రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసుల.