Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి నేరచరిత్రపై ఆరా, గతంలో రెండు కేసులు నమోదు

సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసిన కీలక నిందితుడు నవీన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. యువతి కిడ్నాప్ కు ఉపయోగించిన నవీన్ రెడ్డి కారును శంషాబాద్ లో గుర్తించారు పోలీసులు. అతడి నేరచరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి నేరచరిత్రపై ఆరా, గతంలో రెండు కేసులు నమోదు

Adibatla Kidnap Case : సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసిన కీలక నిందితుడు నవీన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. యువతి కిడ్నాప్ కు ఉపయోగించిన నవీన్ రెడ్డి కారును శంషాబాద్ లో గుర్తించారు పోలీసులు. అతడి నేరచరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గతంలో నవీన్ రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి. 2019 లో వరంగల్ ఇంతియాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో నవీన్ రెడ్డిపై చీటింగ్, ఐటీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అదే ఏడాదిలో రోడ్ యాక్సిడెంట్ వ్యవహారంలోనూ కాచిగూడ పోలీస్ స్టేషన్ లో నవీన్ రెడ్డిపై కేసు నమోదైంది. తాజాగా యువతి కిడ్నాప్ వ్యవహారంలో నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

Also Read..Nizamabad Bride Suicide Case : అయ్యో రవళి.. పెళ్లికి కొన్ని గంటల ముందు వధువు ఆత్మహత్య కేసులో కీలక విషయాలు

హైదరాబాద్ నగర శివారు మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని కిడ్నాప్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ‘మిస్టర్‌ టీ’ ఎండీ నవీన్‌రెడ్డి నేరచరిత్రపై పోలీసులు ఫోకస్ చేశారు. లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌ వ్యవహారం వెనుక కారణాలు, నవీన్ వెనుక ఎవరెవరున్నారు.. తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు.

యువతి కుటుంబం పెళ్లికి నిరాకరించిన నాటి నుంచి పరిణామాలను నిశితంగా తెలుసుకుంటున్నారు. కిడ్నాప్‌ చేశాక యువతిని వాహనంలో ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? బాధితురాలికి అతను ఇంకా ఏమైనా చెప్పాడా? అనే కోణంలో పోలీసులు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతి ఇంటిపై దాడి, కిడ్నాప్‌లో మొత్తం 36 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇప్పటివరకు 32 మందిని అరెస్ట్ చేశారు.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి ఓ సైకో, వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలి- వైశాలి డిమాండ్

కిడ్నాప్ సమయంలో నవీన్ రెడ్డి దాడిలో గాయపడిన యువతి కోలుకుంటోంది. ఆదివారం ఆమె మరోసారి మీడియాతో మాట్లాడింది. నిశ్చితార్థం జరిగే సమయానికి దాదాపు 10మంది ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారంది. బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారంది. తన మామ వారి నుంచి తప్పించి పై గది లోపలికి పంపించి తాళం వేశారంది. అయితే, నిందితులు అక్కడికీ వచ్చారని, తలుపు ధ్వంసం చేశారంది. నవీన్‌ తన గొంతు పట్టుకుని లాక్కెళ్లాడని వాపోయింది. అడ్డుకోబోయిన మా అమ్మను నెట్టేశాడంది. నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత జరిగినా.. నవీన్‌రెడ్డి తల్లి తన కొడుకునే సపోర్ట్ చేస్తూ మాట్లాడటం దారణం అని వాపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పటివరకు ఈ కేసులో 32మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందరిని చర్లపల్లి జైలుకి తరలించారు. ఇంటిపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నవీన్ రెడ్డిని ఈసారి వదిలేది లేదని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నవీన్ రెడ్డి.. ఎక్కడున్నా లొంగిపోవాలని పోలీసులు సూచించారు. కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో నవీన్ రెడ్డి కారుని గుర్తించిన పోలీసులు.. దీని ఆధారంగా అతడు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. వరంగల్, కాచిగూడ పోలీస్ స్టేషన్లలో నవీన్ రెడ్డిపై నమోదైన కేసుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. నవీన్ రెడ్డి నేర చరిత్ర గురించి ఆరా తీస్తున్నారు. మరోసారి పోలీసులు వైశాలి స్టేట్ మెంట్ నమోదు చేయనున్నారు. నవీన్ రెడ్డి నేరచరిత్రకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం నవీన్ రెడ్డి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే నవీన్ ను పట్టుకుంటామని, పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.