Minor Girl: మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం.. ఒకే ఇంట్లో ఉంటున్న బాలిక, నిందితుడు

ఢిల్లీ పరిధిలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక ఇంట్లోనే, వేరే గదిలో ఉంటున్న నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Minor Girl: మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం.. ఒకే ఇంట్లో ఉంటున్న బాలిక, నిందితుడు

Minor Girl: ఢిల్లీ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీ, వజిరాబాద్ పరిధిలోని ఒక అపార్టుమెంట్లో మైనర్ బాలిక కుటుంబంతో కలిసి ఉంటోంది.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

అదే ఇంట్లో వేరే గదిలో యువకుడు కూడా ఉంటున్నాడు. ఇద్దరివీ వేర్వేరు కుటుంబాలు. కాగా, గత నెలలో యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎవరికైనా చెబితే తనను చంపేస్తానని బెదిరించాడు. దీంతో కొద్ది రోజులు ఈ బాధను మౌనంగా భరించిన బాలిక ఇటీవల తన తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కూతురు కలిసి వజిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఇలాంటి మరో ఘటనే తాజాగా మహారాష్ట్రలో జరిగింది.

Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్… దేవుడిని ఏ స్థాయికి తగ్గించామంటూ వ్యాఖ్య

థానే జిల్లా, కల్యాణ్‌లో 41 ఏళ్ల ఒక వ్యక్తి తన పొరుగింటికి చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న బాలికను మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో కూడా నిందితుడు బాలికను బెదిరించాడు. తర్వాత బాలిక కడుపు నొప్పికి గురవడం, అనారోగ్యానికి గురి కావడంతో తల్లి విషయం ఆరా తీయగా అసలు సంగతి బయటపడింది. వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.