Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్… దేవుడిని ఏ స్థాయికి తగ్గించామంటూ వ్యాఖ్య

దేశంలో పలువురు విద్వేష పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై భారత సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్… దేవుడిని ఏ స్థాయికి తగ్గించామంటూ వ్యాఖ్య

Supreme Court: దేశంలో పెరిగిపోతున్న విద్వేష పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

ఈ మేరకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇలాంటి ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరింది. ముస్లింలపై ఇటీవల కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ కేఎమ్ జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువులకు వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ అంశంలో ఇరు పక్షాల వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది.

Amaravati: నవంబర్ 1న సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై విచారణ

‘‘ఇది 21వ శతాబ్దం. కానీ, మనం దేవుడిని ఏ స్థాయికి తగ్గించాం? 51వ అధికరణం ప్రకారం దేవుడి పేరుతో జరిగే వాటిలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి. కానీ, జరుగుతున్నది సరి కాదు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, సంస్కరణను అలవాటు చేసుకోవాలి’’ అని కోర్టు అభిప్రాయపడింది. ‘‘విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. దేశంలో ప్రస్తుతం విద్వేష పూరిత వాతావరణం నెలకొంది. కొన్ని అంశాల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. వీటిని సహించలేం’’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.