Amaravati: నవంబర్ 1న సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై విచారణ

అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని ప్రభుత్వం కోరింది.

Amaravati: నవంబర్ 1న సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై విచారణ

Amaravati: అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై విచారణ త్వరగా చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం ఇటీవల లేఖ రాసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్.. నవంబర్ 1న విచారణ చేపట్టేందుకు అంగీకరించారు.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేస్తూ గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ కేసులో తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ అమరావతి రైతులు కోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు 2,000 పేజీలతో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని ఆ పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

Swamy Goud: కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!

హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమే అని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం.. ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం వివరించింది.