Firing In Cinema Style : బాబోయ్.. సినిమా స్టైల్‌లో ఎదురు కాల్పులు, వీడియో వైరల్

ఒళ్లు గగుర్పొడిచే, షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అక్కడ రెండు కుటుంబాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు కాల్పుల, ఎదురు కాల్పులు జరుపుకునే వరకు గొడవ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో.. వీళ్లేం మనుషులు రా నాయనా? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Firing In Cinema Style : బాబోయ్.. సినిమా స్టైల్‌లో ఎదురు కాల్పులు, వీడియో వైరల్

Firing In Cinema Style : కర్రలు, రాళ్లు, కత్తులు.. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు గన్స్ వచ్చాయి. గొడవ జరిగిందా? అంతే, తుపాకీ పేలాల్సిందే. నువ్వో, నేనో తేల్చుకుందాం అనే రేంజ్ లో ఫైరింగ్ కు దిగుతున్నారు. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. మన దేశంలోనే ఈ దారుణ పరిస్థితులు ఉన్నాయి. గొడవ జరిగితే చాలు.. తుపాకులు బయటకు తీసి కాల్పులకు తెగబడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లో ఒళ్లు గగుర్పొడిచే, షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అక్కడ రెండు కుటుంబాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు కాల్పుల, ఎదురు కాల్పులు జరుపుకునే వరకు గొడవ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో.. వీళ్లేం మనుషులు రా నాయనా? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.(Firing In Cinema Style)

Also Read..Jharkhand: భర్తను హత్యచేసి ఐదు రోజులు ఇంట్లోనే ఉంచిన భార్య.. ఎవరూ రాకుండా కరెంటు పెట్టింది..

ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ ప్రాంతానికి చెందిన వీర్ పల్, రిషిపాల్ కుటుంబాల మధ్య గొడవ ముదిరింది. ఏకంగా గ్రూపుల కాల్పులుగా మారింది. ఒక వర్గం వారు మరో వర్గంపై తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. ఇదంతా ఫోన్ లో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Bihar: గల్లీలో గన్ ఫైట్.. వీడియో తీస్తూ బుల్లెట్ తగిలి విద్యార్థి మృతి

ఒక గ్రూపు మరో గ్రూపుపై కాల్పులు జరుపుకోవడం సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, ఇక్కడ రియల్ గా జరిగింది. ఓ వర్గం వారు మరో వర్గంపై కాల్పులు జరపగా, ఆ వర్గం వారు కూడా ఎదురు కాల్పులకు దిగారు. సినిమా స్టైల్ లో ఫైరింగ్ చేసుకున్నారు. కాల్పుల వ్యవహారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పులకు తెగబడ్డ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఎదురుకాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Crime News: ధాబాలోని ఫ్రీజర్ లో యువతి మృతదేహం లభ్యం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి అరెస్ట్

”పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ తర్వాత.. షాజహాన్ పూర్ లో జరిగిన మరో లైవ్ ఫైరింగ్ చూడండి. శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి అని చెప్పడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. 2 నిమిషాల ఈ వీడియో క్లిప్ లో నేను 15 గన్ షాట్స్ విన్నాను” అని ఓ నెటిజన్ కాల్పుల వీడియోను ఉద్దేశించి కామెంట్ చేశాడు.