Bihar: గల్లీలో గన్ ఫైట్.. వీడియో తీస్తూ బుల్లెట్ తగిలి విద్యార్థి మృతి

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, 10వ వార్డు కౌన్సిలర్ మనీష్ సింగ్ సోదరుడు లాల్ సింగ్‌ను నవ్‌గాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతి కుమారి భర్త డబ్ల్యూ యాదవ్, ఆమె సోదరుడు పప్పు యాదవ్ సహా పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది.

Bihar: గల్లీలో గన్ ఫైట్.. వీడియో తీస్తూ బుల్లెట్ తగిలి విద్యార్థి మృతి

student recording gunfight from terrace shot, dies

Bihar: రెంగు వర్గాల మధ్య జరుగుతున్న గొడవను వీడియో రికార్డ్ చేస్తుండగా ఒక విద్యార్థి బుల్లెట్ తగిలి చనిపోయాడు. బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని నౌగాచియాలో జరిగిందీ దారుణ ఘటన. మృతుడి పేరు ఆశిష్ కుమార్‌. టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇరువర్గాల గొడవ జరుగుతుండగా టెర్రస్‌పై నుంచి వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఒక వర్గంలోని వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతే బుల్లెట్ నేరుగా వచ్చి ఆశిష్ చాతిలో దిగింది. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Owaisi on Sharad Pawar: ఒకవేళ శరద్ పవార్ కనుక షాదాబ్ అయ్యుంటే.. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై విరుచుకుపడ్డ ఓవైసీ

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆశిష్ ఇంటి ముందు స్థానిక కార్పొరేటర్లకు చెందిన రెండు గ్రూపులు గొడవకు దిగాయి. ఓ చేత ఆయుధాలు పట్టుకుని మరొక చేతితో ఒకరినొకరు తోసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఆశిష్ సహా మరికొంత మంది విద్యార్థులు టెర్రస్ మీద నుంచి ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియో రికార్డు చేస్తున్నారు. ఇరువర్గాలు పరస్పరం పోట్లాడుకుంటున్న సమయంలో ఎవరో తుపాకీతో పేల్చడంతో బుల్లెట్ నేరుగా ఆశిష్‌కు తగిలింది.

Pralhad Joshi: కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇవ్వలేదు. అందుకే జనాభా పెరిగింది.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, 10వ వార్డు కౌన్సిలర్ మనీష్ సింగ్ సోదరుడు లాల్ సింగ్‌ను నవ్‌గాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతి కుమారి భర్త డబ్ల్యూ యాదవ్, ఆమె సోదరుడు పప్పు యాదవ్ సహా పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. కౌన్సిలర్ మనీష్ సింగ్ కూడా అక్కడికక్కడే ఉండి ఇరువర్గాల మధ్య వాగ్వాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. గొడవ మధ్యలో, డబ్ల్యూ యాదవ్ సహచరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే ఆశిష్ చనిపోయినట్లు తెలిపారు. ఆశిష్‭‭కు బుల్లెట్ తగిలేంత వరకు ఆ గొడవంతా రికార్డైంది.