Jharkhand: భర్తను హత్యచేసి ఐదు రోజులు ఇంట్లోనే ఉంచిన భార్య.. ఎవరూ రాకుండా కరెంటు పెట్టింది..

ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగాలేని భర్య తన భర్తను హత్యచేసింది. ఐదురోజులుగా భర్త మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

Jharkhand: భర్తను హత్యచేసి ఐదు రోజులు ఇంట్లోనే ఉంచిన భార్య.. ఎవరూ రాకుండా కరెంటు పెట్టింది..

CRIME NEWS

Jharkhand: ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగాలేని భర్య తన భర్తను హత్యచేసింది. ఐదురోజులుగా భర్త మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. విషయాన్ని పుణెలో ఉంటున్న వారి కుమారుడికి సమాచారం ఇచ్చారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అయితే, ఇంట్లోకి ఎవరూ రాకుండా ఇంటి డోర్‌కు ఆ మహిళ కరెంట్ పెట్టింది. అతికష్టంమీద ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Crime News: ధాబాలోని ఫ్రీజర్ లో యువతి మృతదేహం లభ్యం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి అరెస్ట్

ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో దారుణం జరిగింది. ఓల్డ్ షుభాష్ కాలనీలో రవాణా, రియల్ ఎస్టేట్‌లలో వ్యాపారంచేసే అమర్‌నాథ్ సింగ్, అతని భార్య మీరా నివాసం ఉంటున్నారు. వీరి కుమారులు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. మీరా మానసిక స్థితి సరిగా లేదు. భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. చాలాసార్లు మీరా ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేసేది. వీరి మధ్య గత వారంరోజుల క్రితం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో మీరా భర్త అమర్‌నాథ్ సింగ్‌ను హతమార్చి, అతని మృతదేహానికి నిప్పంటించింది. అయితే, మృతదేహం సగం కాలింది. ఐదురోజులుగా ఇంట్లోనుంచి ఎవరూ బయటకు రాకపోవటం, ఇంట్లో నుంచి దుర్వాస రావడంతో చుట్టుపక్కల వారు ఇంటిలోకి వెళ్లి చూసేందుకు ప్రయత్నించారు. మహిళ ఇంట్లోకి ఎవరూ రాకుండా తలుపుకు తాళంవేసి, తలుపుకు కరెంట్ సరఫరా అయ్యేలా ఏర్పాటు చేసింది.

Crime News: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై హత్య చేసిన ముగ్గురు దుండగులు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

విషయాన్ని ఫుణెలో చదువుతున్న కుమారుడికి చెప్పడంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే సమయానికి మహిళ ఇంటి కప్పుపైకి ఎక్కి స్థానిక ప్రజలను బెదిరించింది. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తలుపు తెరిచేందుకు ప్రయత్నం చేశారు. తలుపుకు విద్యుత్ సరఫరా అవుతుండటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీసులు అతికష్టం మీద లోపలికి ప్రవేశించారు. సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  అనంతరం మీరాను అదుపులోకి తీసుకున్నారు.