Crime News: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై హత్య చేసిన ముగ్గురు దుండగులు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ముగ్గురు దుండగులు కత్తులతో ఓ వ్యక్తి వెంటపడ్డారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

Crime News: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై హత్య చేసిన ముగ్గురు దుండగులు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Karnataka teacher beats class 4 student to death

Updated On : January 22, 2023 / 6:16 PM IST

Crime News: హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ముగ్గురు దుండగులు కత్తులతో ఓ వ్యక్తి వెంటపడ్డారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించారు. కుల్సుంపురలో చోటుచేసుకున్న ఈ హత్యతో స్థానికంగా కలకలం చెలరేగింది. బాధితుడు ఎవరన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అతడిని ముగ్గురు దుండగులు ఎందుకు తరుముకుంటూ వచ్చారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మృతదేహాన్ని కాసేపట్లో పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. హత్య ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించనున్నారు. దుండగులు ఏ ప్రాంతం నుంచి వచ్చారన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tirumala Temple Drone Visuals : తిరుమలలో డ్రోన్ అలజడి.. ఆ వీడియోలు తీసిన నిందితుల కోసం పోలీసుల వేట