TSPSC Paper Leak : AE పేపర్ ఒక్కటేనా? ఇంకా లీక్ అయ్యాయా? TSPSC పేపర్ లీక్‌లో విచారణ వేగవంతం

సిస్టమ్ ఐపీ ఎలా మార్చారు? డైనమిక్ పాస్ వర్డ్ ఎలా క్రియేట్ చేశారు? గతేడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ చేశారా? ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్) పేపర్ కాకుండా ఇంకా వేరే పేపర్లను ఎవరికైనా పంపారా? క్వశ్చన్ పేపర్ ని రేణుక ఎవరెవరికి ఇచ్చారు? అనే కోణంలో సిట్ విచారణ చేస్తోంది. రేణుక్ కాల్ డేటాలోని కాంటాక్ట్ నెంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. నిందితుల స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు వీడియోగ్రఫీ చేస్తున్నారు.

TSPSC Paper Leak : AE పేపర్ ఒక్కటేనా? ఇంకా లీక్ అయ్యాయా? TSPSC పేపర్ లీక్‌లో విచారణ వేగవంతం

TSPSC Paper Leak : సిస్టమ్ ఐపీ ఎలా మార్చారు? డైనమిక్ పాస్ వర్డ్ ఎలా క్రియేట్ చేశారు? గతేడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ చేశారా? ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్) పేపర్ కాకుండా ఇంకా వేరే పేపర్లను ఎవరికైనా పంపారా? క్వశ్చన్ పేపర్ ని రేణుక ఎవరెవరికి ఇచ్చారు? అనే కోణంలో సిట్ విచారణ చేస్తోంది. రేణుక్ కాల్ డేటాలోని కాంటాక్ట్ నెంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. నిందితుల స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు వీడియోగ్రఫీ చేస్తున్నారు.

Also Read..TSPSC Paper Leak : 5 పేపర్లు కొట్టేసిన ప్రవీణ్.. TSPSC పేపర్ లీక్ కేసు విచారణలో కీలక విషయాలు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపింది. ఈ కేసులో 9మంది నిందితులకు నాంపల్లి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం ఉదయం సిట్ అధికారులు.. నిందితులను చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి వారందరినీ తీసుకెళ్లారు.

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

నిందితులను అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఏ విధంగా ఐపీ అడ్రస్ లు చేంజ్ చేశారు? ఏ విధంగా పేపర్లు దొంగిలించారు? దీనిపై రాజశేఖర్, ప్రవీణ్ లను, ఉద్యోగులను ప్రశ్నించారు. అలాగే వారి చాంబర్స్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వారి స్టేట్ మెంట్లు కూడా నమోదు చేశారు.

పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఫోన్‌ను సీజ్ చేసి పోలీసులు విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ కేవలం ఒక్క అమ్మాయికే కాదు.. సుమారు 40 మంది మహిళలకు ఫోన్ చేసినట్టు తెలిసింది. న్యూడ్ కాల్స్ చేయాలని వారిపై ఒత్తిడి కూడా తెచ్చినట్టు సమాచారం. అతడి ఫోన్ లో అమ్మాయిల నగ్న ఫొటోలు, న్యూడ్ వీడియోలు ఉన్నట్లు గుర్తించి నివ్వెరపోయారు.

ఈ పేపర్ లీకేజీలో మరో నిందితుడు రాజశేఖర్ గురించి పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. పేపర్ లీక్‌లో రాజశేఖర్ సూత్రధారిగా ఉన్నాడు. రాజశేఖర్.. ప్రవీణ్ ద్వారా పేపర్‌ని బయటికి తెప్పించాడు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజశేఖర్.. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌లో వచ్చాడు. ప్రవీణ్, రాజశేఖర్ ఇద్దరూ కలిసి పేపర్‌ను బయటకు తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. కంప్యూటర్‌కు సంబంధించిన ఐడీ, పాస్‍వర్డ్ ఇచ్చినందుకు ప్రవీణ్ భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లు గుర్తించారు.