TSPSC Paper Leak : 5 పేపర్లు కొట్టేసిన ప్రవీణ్.. TSPSC పేపర్ లీక్ కేసు విచారణలో కీలక విషయాలు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రవీణ్ కోసం రాజశేఖర్.. సిస్టమ్ లో మార్పులు చేసినట్లు గుర్తించారు.

TSPSC Paper Leak : 5 పేపర్లు కొట్టేసిన ప్రవీణ్.. TSPSC పేపర్ లీక్ కేసు విచారణలో కీలక విషయాలు

TSPSC Paper Leak : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు వేగవంతం చేసింది సిట్. టీఎస్ పీఎస్ సీ అధికారులతో సిట్ చీఫ్ సమావేశం అయ్యారు. దర్యాఫ్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లు గుర్తించారు. మరోవైపు ప్రవీణ్ కోసం రాజశేఖర్.. సిస్టమ్ లో మార్పులు చేసినట్లు గుర్తించారు.

ఏఈ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. పేపర్ లీకేజ్ ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ మొత్తం ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లు విచారణలో వెల్లడైంది. రాజశేఖర్ అనే వ్యక్తి సాయంతో ప్రవీణ్‌ పేపర్లు కొట్టేశాడని సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్‌కు లబ్ధి చేకూర్చేందుకు రాజశేఖర్‌ ల్యాన్‌లో మార్పులు చేసినట్లు తెలుసుకున్నారు.

లీకేజీ వ్యవహారంపై విచారిస్తున్న సిట్‌ చీఫ్‌.. టీఎస్‌పీఎస్సీ అధికారులతో భేటీ అయ్యారు. లక్ష్మి దగ్గర పాస్‌వర్డ్‌ ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై ఆరా తీశారు.

Also Read..Dasoju Sravan: బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. దాసోజు శ్రవణ్ ఆరోపణ

ప్రవీణ్‌ కొట్టేసిన పేపర్లలో ఏఈతో పాటు టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్ ఓవర్సీస్‌ పరీక్షా పత్రాలు ఉండగా.. ఆ పరీక్షలు ఇప్పటికే అయిపోయాయి. వీటితో పాటు భవిష్యత్‌లో జరగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌ పోస్టుల పేపర్లు కూడా ప్రవీణ్‌ దగ్గరే ఉన్నాయి. అయితే సమయం వచ్చినప్పుడు ఆ పేపర్లను విక్రయించాలని ప్లాన్ చేశాడు ప్రవీణ్‌. వీటితో పాటు భవిష్యత్‌లో మరిన్ని పేపర్లు కొట్టేసే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రవీణ్‌, రేణుక మధ్య పేపర్లు ఇచ్చే డీల్‌ కుదిరినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

టీఎస్ పీఎస్ సీ ఏఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే.. 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఫోన్‌ను సీజ్ చేసి విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ కేవలం ఒక్క అమ్మాయికే కాదు.. సుమారు 40 మంది మహిళలకు ఫోన్ చేసినట్టు తెలిసింది. న్యూడ్ కాల్స్ చేయాలని వారిపై ఒత్తిడి కూడా తెచ్చినట్టు సమాచారం.

ఈ పేపర్ లీకేజీలో మరో నిందితుడు రాజశేఖర్ గురించి పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. పేపర్ లీక్‌లో రాజశేఖర్ సూత్రధారిగా ఉన్నాడు. ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజశేఖర్.. ప్రవీణ్ ద్వారా పేపర్‌ని బయటికి తెప్పించాడు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజశేఖర్.. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌లో వచ్చాడు. ప్రవీణ్, రాజశేఖర్ ఇద్దరూ కలిసి పేపర్‌ను బయటకు తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. కంప్యూటర్‌కు సంబంధించిన ఐడీ, పాస్‍వర్డ్ ఇచ్చినందుకు ప్రవీణ్ భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లు గుర్తించారు.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

ఈ నెల 5న టీఎస్ పీఎస్ సీ నిర్వహించిన.. అసిస్టెంట్ ఇంజినీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్ లీక్ అయినట్లు హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో లీకేజీకి పాల్పడింది టీఎస్ పీఎస్ సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ కాగా.. ప్రధాన నిందితులుగా రేణుక, డాక్యా దంపతులు ఉన్నారు.