Seema Haider : సీమా హైదర్‌ను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తాం : కర్ణిసేన హెచ్చరిక

పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ బాగోతంపై సంప్రదాయవాద హిందూ సంస్థ కర్ణిసేన సంచలన ప్రకటన చేసింది. ప్రేమ పేరుతో భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పై చర్య తీసుకోకుంటే ఆమెను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తామని కర్ణిసేన హెచ్చరించింది....

Seema Haider : సీమా హైదర్‌ను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తాం : కర్ణిసేన హెచ్చరిక

Pakistani woman Seema Haider

Pakistani woman Seema Haider : పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ బాగోతంపై సంప్రదాయవాద హిందూ సంస్థ కర్ణిసేన సంచలన ప్రకటన చేసింది. ప్రేమ పేరుతో భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పై చర్య తీసుకోకుంటే ఆమెను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తామని కర్ణిసేన హెచ్చరించింది. ( Will throw Seema Haider at Pakistan border)

Seema Haider : సీమా హైదర్ సోదరుడు, మామ పాక్ ఆర్మీలో…షాకింగ్ నిజం

అక్రమంగా భారత సరిహద్దు దాటిన పాక్ జాతీయురాలు సీమా హైదర్‌కు కర్ణిసేన బెదిరించింది. (Pakistani woman Seema Haider) భారతదేశం అనాధ శరణాలయం కాదని, ఎవరైనా తమ సౌలభ్యం మేరకు రావచ్చని కర్ణి సేన (Karni Sena) జాతీయ ఉపాధ్యక్షుడు ముఖేష్‌ సింగ్‌ రావల్‌ అన్నారు. సీమా హైదర్ భారతదేశంలోకి ప్రవేశించిన విధానం అనుమానాస్పదంగా ఉందని ఆమె పాకిస్థానీ ఏజెంట్ అని ముఖేష్ సింగ్ ఆరోపించారు.

Jammu and Kashmir : అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరికి గాయాలు

సీమాను ఎవరూ తనిఖీలు చేయలేదని, ఆమె శరీరంలో చిప్ అమర్చి ఉంటారని ముఖేష్ అనుమానం వ్యక్తం చేశారు. సీనా హైదర్‌కు ఏదైనా రహస్య పరికరం అమర్చి ఉంటే, ఆమెను క్షుణ్ణంగా స్కాన్ చేయాలని ముఖేష్ సింగ్ రావల్ డిమాండ్ చేశారు. ఆగస్టు 15వతేదీ సమీపిస్తున్నందున ఆమెను వీలైనంత త్వరగా పంపించాలని ఆయన కోరారు.

Earthquake : ఎల్ సాల్వడార్ పసిఫిక్ తీరంలో భారీభూకంపం

గోరక్షా హిందూ దళ్ అనే రైట్‌వింగ్ సంస్థ సీమా హైదర్‌కు దేశం విడిచి వెళ్లాలని 72 గంటల అల్టిమేటం జారీ చేసింది. సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచారి కావచ్చని, దేశానికి ముప్పు వాటిల్లుతుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వేద్ నగర్ వీడియోను విడుదల చేశారు.