Seema Haider : సీమా హైదర్ సోదరుడు, మామ పాక్ ఆర్మీలో…షాకింగ్ నిజం

పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంటా? అనే విషయంపై ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. పబ్ జి ఆట ద్వారా భారత యువకుడు సచిన్ ప్రేమలో పడి అక్రమంగా నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చిన సీమాపై పలు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి....

Seema Haider : సీమా హైదర్ సోదరుడు, మామ పాక్ ఆర్మీలో…షాకింగ్ నిజం

Pakistani woman Seema Haider

Pakistani woman Seema Haider : పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంటా? అనే విషయంపై ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. పబ్ జి ఆట ద్వారా భారత యువకుడు సచిన్ ప్రేమలో పడి అక్రమంగా నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చిన సీమాపై పలు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. (Pakistani woman Seema Haider) సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో చేరాడని వెల్లడైంది. దీంతోపాటు ఆమె మామ కూడా గులాం అక్బర్ పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్నాడని తేలింది. (brother, uncle in Pakistan Army)

North Korea : ఉత్తర కొరియా మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

ఈ విషయాన్ని సీమా భర్త గులాం హైదర్ చెప్పడం విశేషం. కరాచీలోని పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్, ఆయన సోదరి అయిన తన భార్య సీమా తరచూ మాట్లాడుకునే వారనే విషయాన్ని భర్త గులాం బయటపెట్టాడు. సీమా మామ పాకిస్థాన్ ఆర్మీలో ఉన్నత పదవిలో ఉన్నారని, ఆయన ఇస్లామాబాద్‌లో ఉంటున్నారని గులామ్ చెప్పారు. సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో ఆమెకు గల సంబంధాలపై ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆరా తీస్తున్నారు.

Adani : హిండన్‌ బర్గ్ రిపోర్ట్‌పై అదానీ సంచలన వ్యాఖ్యలు

ఆమె పాకిస్థాన్ పౌరసత్వ ఐడీ కార్డు పొందడంలో జాప్యంపై ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. వీసా లేకుండానే ఆమె భారత్‌లోకి ప్రవేశించడంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ప్రస్థుతం సీమా హైదర్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి నివసిస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసించే తన 22 ఏళ్ల ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి జీవించడానికి సీమా హైదర్ మే నెలలో నేపాల్ నుంచి బస్సులో తన నలుగురు పిల్లలతో సహా భారతదేశంలోకి ప్రవేశించారు.

Chandrayaan-3: చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 గొప్పేంటీ? రెండింటి మధ్య ఆ 5 తేడాలివే..

ఈ జంట మొదట 2019వ సంవత్సరంలో పబ్ జి ఆట ద్వారా పరిచయమయ్యారు. జులై 4వతేదీన అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు సీమా హైదర్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిద్దరికీ స్థానిక కోర్టు జులై 7వతేదీన బెయిల్ మంజూరు చేసింది. సీమా నలుగురు పిల్లలతో కలిసి రబుపురా ప్రాంతంలోని ఒక ఇంట్లో నివసిస్తున్నారు. సీమాకు ఆంగ్ల భాషలో ఉన్న ప్రావీణ్యం, పాక్ ఆర్మీలో సోదరుడు, మామ ఉన్న నేపథ్యంలో ఆమెకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయా అనే కోణంలో భారత నిఘా సంస్థలు దర్యాప్తు సాగిస్తున్నాయి.