North Korea : ఉత్తర కొరియా మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

ఉత్తర కొరియా బుధవారం తెల్లవారుజామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపింది....

North Korea : ఉత్తర కొరియా మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

North Korea tests two missiles

Updated On : July 19, 2023 / 5:54 AM IST

North Korea tests two missiles : ఉత్తర కొరియా బుధవారం తెల్లవారుజామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపింది. (North Korea tests two missiles) ఉత్తర కొరియా బుధవారం తెల్లవారుజామున ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని సైట్ నుంచి రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

Prem Kumar Trailer : పెళ్లి కోసం సంతోష్ శోభ‌న్ పాట్లు.. మెగా మేన‌ల్లుడికి పోటీగా..

నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా దక్షిణ కొరియాలోని ఓడరేవుకు అణు బాలిస్టిక్ క్షిపణులను పేల్చగల జలాంతర్గామిని అమెరికా తీసుకొచ్చింది. ఈ జలాంతర్గామి (US nuclear submarine) వచ్చిన కొన్ని గంటల తర్వాత ఉత్తర కొరియా తన తూర్పు తీరంలో ఉన్న సముద్రంలో రెండు క్షిపణులను ప్రయోగించింది. సియోల్, వాషింగ్టన్ ల మధ్య రక్షణ సహకారం పెరిగిన నేపథ్యంలో రెండు కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Pawan Kalyan : రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, ఎన్డీయే కూటమి సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా (South Korea) సైన్యం తెలిపింది. మిత్రపక్షాలు మంగళవారం సియోల్‌లో మొదటి న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించాయి. 1981వ సంవత్సరం తర్వాత మొదటిసారిగా బుసాన్‌లో ఒక అమెరికన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ పోర్ట్ సందర్శన చేస్తున్నట్లు ప్రకటించింది.