Prem Kumar Trailer : పెళ్లి కోసం సంతోష్ శోభన్ పాట్లు.. మెగా మేనల్లుడికి పోటీగా..
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్(Santosh Soban) ఒకరు. గోల్కొండ హై స్కూల్ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా మారాడు.

Prem Kumar Trailer
Prem Kumar : టాలీవుడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్(Santosh Soban) ఒకరు. ‘గోల్కొండ హై స్కూల్’ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. ‘పేపర్ బాయ్’ చిత్రంతో హీరోగా మారాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రం ‘ప్రేమ్‌కుమార్’. అభిషేక్ మహర్షి (Abhishek Maharshi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏడాది క్రితమే ఈ సినిమా షూటింగ్ పూరైనప్పటికి పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
Abbas : అమ్మాయి వదిలేసింది.. సూసైడ్ ప్రయత్నం.. సినిమాలు మానేశా.. ట్యాక్సీ డ్రైవర్‌గా..
ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో విడుదల తేదీని ఖారారు చేసుకుంది. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో సంతోష్ శోభన్ పెళ్లి కోసం పాట్లు పడుతుంటాడు. పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. విసిగిపోయిన అతడు ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెడుతాడు. తరువాత ఏం జరిగింది..? బిజినెస్ క్లిక్ అయ్యిందా..? పెళ్లి చేసుకున్నాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల అయ్యే వారం రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ శోభన్ సినిమా విడుదల రోజే వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆది కేశవ’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ మామా అల్లుళ్ల పోటీని తట్టుకుని సంతోష్ నిలబడతాడో లేదో చూడాలి.