Pawan Kalyan : రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, ఎన్డీయే కూటమి సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు పవన్ కల్యాణ్. Pawan Kalyan

Pawan Kalyan : రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, ఎన్డీయే కూటమి సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

Pawan Kalyan(Photo : Google)

Pawan Kalyan – NDA : దేశానికి మోదీ లాంటి బలమైన నాయకుడు, బలమైన నాయకత్వం అవసరం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మోదీ నాయకత్వాన్ని తాము కోరుకుంటున్నామని చెప్పారాయన. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు పవన్ కల్యాణ్. ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

”ఎన్డీఏ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో గెలుపు మీద చర్చించాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కల్పించిన మౌలిక వసతులు గురించి చర్చించాం.

Also Read..Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్.. అంతేకాదు..

ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఉదాహరణకు పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు.. దేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలని అనుకున్నాను. ఆ సమయంలో నరేంద్ర మోడీ మనకి దొరికారు. సీట్ల సర్దుబాటు, పొత్తుల చర్చ జరగలేదు. ఏపీకి సంబంధించి చర్చ కాదు, దేశ స్థాయిలో అంశాల గురించి చర్చ జరిగింది. విపక్ష కూటమికి ఇండియా పేరు సమస్య అవుతుందని నేను భావించడం లేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇక, ఏపీ నుంచి ఎన్డీఏలోకి ఎవరైనా చేరతారా అన్న అంశంపై స్పందించిన పవన్.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని హాట్ కామెంట్స్ చేశారు.

Also Read..Janasena Party: జంపింగ్‌లకు ప్రత్యామ్నాయంగా జనసేన.. వారాహి యాత్రతో పవన్ పార్టీలో జోష్!