Chandrayaan-3: చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 గొప్పేంటీ? రెండింటి మధ్య ఆ 5 తేడాలివే..

చంద్రయాన్-2 మొత్తం బరువు 3850 కిలోలు. చంద్రయాన్-3 మొత్తం బరువు 3900 కిలోలు. అందులో...

Chandrayaan-3: చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 గొప్పేంటీ? రెండింటి మధ్య ఆ 5 తేడాలివే..

Chandrayaan-3

Chandrayaan-3 ISRO: తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (Satish Dhawan Space Centre) లో చంద్రయాన్‌-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ అయింది. ఈ ప్రక్రియ 24 గంటల పాటు కొనసాగి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటల 13 నిమిషాలకు ఎల్‌వీఎం-3పీ4 (LVM-3P4) వాహకనౌక నిప్పులుచిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తుంది.

సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఇస్రో చేస్తున్న రెండో ప్రయోగం ఇది. ఈ సారి విజయవంతం అవుతామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రయాన్-2 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదన్న విషయం తెలిసిందే. దీంతో చంద్రయాన్-2 కంటే ఉత్తమంగా చంద్రయాన్-3ను రూపొందించే విషయంలో పలు మార్పులు, చేర్పులు చేశారు. అవేంటో చూద్దాం..

చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే ఆర్బిటర్స్ (Orbiters) అక్కడి పరిస్థితులను పసిగడతాయి. చంద్రయాన్-2లో ఆర్బిటర్ సమాచారాన్ని ఉపయోగించుకోనున్న చంద్రయాన్-3లో ఉపయోగించుకుంటున్నారు. చంద్రయాన్-2లో చంద్రుడి ఫొటోలను ఆర్బిటర్ స్పష్టంగా తీసింది.

చంద్రయాన్-2
చంద్రయాన్-2 మొత్తం బరువు 3850 కిలోలు. అందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఆ ఆర్బిటర్ జీవిత కాలం ఏడాది. ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే. చంద్రయాన్-2 వాహకనౌక వ్యయం రూ.603 కోట్లు. GSLV MK III-M1తో దాని ప్రయోగానికి మరో రూ.367 కోట్లు ఖర్చయ్యాయి.

ప్రయాణ సమయం 48 రోజులు. ల్యాండర్ లో 5 థ్రస్టర్లు ఉంటాయి. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఆర్బిటర్ మాత్రం కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్-2లో ల్యాండింగ్ కు 500ఎం/500ఎం ప్రాంతం ఎంపిక చేశారు. అప్పట్లో ఇంధనం సరిపోలేదు. ల్యాండర్, రోవర్ లో ఒకే విధమైన పేలోడ్స్ ఉంటాయి. పేలోడ్స్, ల్యాండర్ బరువు తక్కువ ఉంటుంది.

చంద్రయాన్-3
చంద్రయాన్-3 మొత్తం బరువు 3900 కిలోలు. అందులో ప్రొపల్సన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ప్రొపల్సన్ మాడ్యూల్ జీవిత కాలం 3 నుంచి 6 నెలలు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే. చంద్రయాన్-3 వాహకనౌక వ్యయం రూ.615 కోట్లు.

ప్రయాణ సమయం 42 రోజులు. ల్యాండర్ లో 4 థ్రస్టర్లు ఉంటాయి. మిషన్ ల్యాండింగ్ ఏరియాలో మార్పులు చేశారు. ల్యాండింగ్ కు 4 కి.మీ/2.4కి.మీ ప్రాంతం ఎంపిక చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించేలా ఇంధనం సమకూర్చారు. వేర్వేరు విధంగా పేలోడ్స్ పనిచేస్తాయి. పేలోడ్స్, ల్యాండర్ బరువు ఎక్కువ ఉంటుంది. విక్రమ్ ల్యాండర్ కి చంద్రయాన్-2లో వాడిన వాటి కంటే శక్తిమంతమైన లెగ్స్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే రోవర్స్ ను డిజైన్ చేసి పంపుతున్నారు.

Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇన్ని రకాల మిషన్లా?.. ఇవి అత్యద్భుతం కదా?