Chiranjeevi Charitable Trust: చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. ఎఫ్‌సీఆర్‌ఏ కి గ్రీన్‌ సిగ్నల్‌

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌(Chiranjeevi Charitable Trust) ను ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు చేసుకునేందుకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దీనిద్వారా విదేశాల నుంచి కూడా విరాళాలు తీసుకునే వెసులుబాటును కల్పించింది.

Chiranjeevi Charitable Trust: చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. ఎఫ్‌సీఆర్‌ఏ కి గ్రీన్‌ సిగ్నల్‌

Central government grants FCRA clearance to Chiranjeevi Charitable Trust

Updated On : November 28, 2025 / 10:02 AM IST

Chiranjeevi Charitable Trust: మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన చేసే సేవ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే కొన్ని వేల ముందుకి ఆయన ఆర్ధిక సహాయం అందించాడు. ఆయన సేవాగుణం నుంచి వెలిసిందే “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్”(Chiranjeevi Charitable Trust). అందులో భాగంగానే ఆయన బ్లడ్ అండ్ ఎయె బ్యాంకు ను కూడా ఏర్పాటు చేశాడు. దాదాపు 27 ఏళ్లుగా ఈ సంస్థ నుంచి ఎంతో మంది రక్తం, నేత్రాలు పొంది పునర్జీవనాన్ని గడుపుతున్నారు. కొరోనా సమయంలో కూడా ఈ ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Mass Jathara OTT: గుడ్ న్యూస్.. ఓటీటీకి వచ్చేసిన మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

అయితే, తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈమేరకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ను ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు చేసుకునేందుకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దీనిద్వారా విదేశాల నుంచి కూడా విరాళాలు తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. కొంతకాలం క్రితం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేసిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కూడా ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి కోసం కేంద్రానికి అపీల్ చేసుకోగా అనుమతి లభించింది.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా చేస్తున్నాడు చిరంజీవి. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.