Naveen Polishetty: ప్రమాదంలో చేయి, వెన్నెముకకు గాయాలు.. అసలు సినిమాలు చేయగలనా.. నవీన్ ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) గురించి, ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన ఈ హీరో.. ఆ తరువాత సోలో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
Hero Naveen Polishetty emotional comments at Anaganaga Oka Raju song release event
Naveen Polishetty: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి, ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన ఈ హీరో.. ఆ తరువాత సోలో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన కెరీర్ టర్న్ తీసుకుంది. ఆ తరువాత చేసిన జాతిరత్నాలు ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెల్సిందే. తన కామెడీ టైమింగ్ తో సినిమాను నెక్సల్ లెవల్లో నిలబెట్టాడు ఈ హీరో. నెక్స్ట్ స్టార్ బ్యూటీ అనుష్క తో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా మంచి విజయం సాధించింది.
Paanch Minar OTT: రిలీజైన వారానికే ఓటీటీకి వచ్చేసిన ‘పాంచ్‌మినార్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్కడివరకు బాగానే ఉంది కానీ, తన నాలుగవ సినిమాగా అనగనగా ఒకరాజు సినిమాను స్టార్ట్ చేశాడు నవీన్((Naveen Polishetty)). షూటింగ్ స్టార్ట్ అయినా కొన్ని రోజులకే ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ కి దూరం అయ్యాడు. దాదాపు ఒక ఏడాది రెస్ట్ లోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా ఈ సినిమాను కంప్లీట్ చేసిన నవీన్ ప్రేక్షకులను తన సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా అనగనగా ఒకరాజు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
“నాది సైలెంట్ బ్యాచ్ కాదు.. అల్లరి చేసే బ్యాచే. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం మీ అందరి సపోర్ట్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలను మీరు ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాను. మధ్యలో ప్రమాదం జరిగి షూటింగ్‌కు వెళ్లలేకపోయా. చేతికి, వెన్నెముకకు చాలా గాయాలయ్యాయి. ఏడాదిపాటు రెస్ట్ లోనే ఉన్నాను. ప్రేక్షకులను మళ్లీ ఎంటర్‌టైన్ చేయగలనా అని అనుకున్నాను. మీ ఆశీస్సుల వల్లే పండగలాంటి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. పాట పాడాను, డ్యాన్స్ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
