“అఖండ రాక్స్”.. అఖండ 2 కోసం శక్తివంతమైన వాహనం.. రిలీజ్ చేసిన మేకర్స్.. ఒక రేంజ్ లో ఉంది కదా..

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. మాస్ చిత్రాల దర్శకుడూ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే, ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

“అఖండ రాక్స్”.. అఖండ 2 కోసం శక్తివంతమైన వాహనం.. రిలీజ్ చేసిన మేకర్స్.. ఒక రేంజ్ లో ఉంది కదా..

A powerful vehicle Akhanda Roxx released from Akhanda 2 movie

Updated On : November 28, 2025 / 7:55 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. మాస్ చిత్రాల దర్శకుడూ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే, ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దాంతో, అఖండ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడప్పడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mangli: ఫోక్ సింగర్ మంగ్లీపై వల్గర్ కామెంట్స్.. ఫిర్యాదు మేరకు వ్యక్తి అరెస్ట్..

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాలో ఉపయోగించిన ఒక శక్తివంతమైన వాహనాన్ని విడుదల చేశారు మేకర్స్. కేవలం అఖండ 2 కోసమే ఈ వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.దీనికి సంబందించిన ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింగి. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి పాల్గొన్నారు. ఈ వాహనం గురించి ఆయన మాట్లాడుతూ.. “అఖండ 2 సినిమాలో ఒక శక్తివంతమైన పాత్ర కోసం ఈ వాహనాన్ని డిజైన్ చేయించాం. తెరపైన ఈ వాహనాన్ని చూసి ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ వాహనాన్ని డిజైన్ చేసిన అమర్ కి నా కృతజ్ఞతలు. నాలుగు రోజులు కష్టపడి ఈ డిజైన్‌ చేశాడు. ఇక అఖండ 2 అనేది కేవలం సినిమా మాత్రమే కాదు భారతదేశపు ఆత్మ. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనేది రేపు సినిమా చూశాక మీకు అర్థమవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు బోయపాటి శ్రీను.