Jammu and Kashmir : అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరికి గాయాలు
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. కశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు.....

Jammu and Kashmir
Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. కశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు. (Two Migrant Labourers Shot) గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించామని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. ( Terrorists In Anantnag) క్షతగాత్రులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని పోలీసులు చెప్పారు.
Seema Haider : సీమా హైదర్ సోదరుడు, మామ పాక్ ఆర్మీలో…షాకింగ్ నిజం
కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం తాము గాలిస్తున్నామని పోలీసులు ట్విట్టరులో తెలిపారు. షోపియాన్ జిల్లాలోని గాగ్రెన్ ప్రాంతంలో గురువారం ముగ్గురు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్మూకశ్మీరులో ఇటీవల ఉగ్రవాదుల కదలికలు కనిపించడంతో వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. దీంతో కశ్మీరులో తరచూ ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.