Hyd : నగ్న వీడియోలతో యువకుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి!

ఆమె చెప్పినట్లే చేశాడు. తర్వాత..అసలు విషయం తెలుసుకుని.. లబోదిబోమంటూ..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.

Hyd : నగ్న వీడియోలతో యువకుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి!

Hyd

Woman Blackmailing : ఫేస్ బుక్ లో పరిచయమయ్యారు. అవతలి వ్యక్తి యువతి కావడంతో..ఆ యువకుడు ఛాటింగ్ చేయడం ప్రారంభించాడు. మత్తుగా..ఛాటింగ్ చేస్తుండడంతో ఆ యువకుడు అట్రాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ యువతి నగ్నంగా ఉన్న వీడియోలు చూపించింది. ఇలానే చేయాలంటూ..ఆ యువకుడికి చెప్పింద. ఏదో ఊహించుకుని..ఆమె చెప్పినట్లే చేశాడు. తర్వాత..అసలు విషయం తెలుసుకుని.. లబోదిబోమంటూ..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. ఈ ఘటన మహానగరంలో చోటు చేసుకుంది.

Read More : killer Egg : మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

వివరాల్లోకి వెళితే…

బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని  రోడ్ నెంబర్ 12లో భోలానగర్ లో ఓ వ్యక్తి ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి. ఫేస్ బుక్ లో సాక్షి వర్మారెడ్డి పేరిట ఓ యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా..స్నేహితులుగా మారిపోయారు. కొద్ది రోజులు ఛాటింగ్ చేసుకున్నారు. తన నగ్న వీడియోలు తీసి ఆ యువకుడికి షేర్ చేసింది. ఇలానే చేసి వీడియోలు పంపాలంటూ..యువకుడికి సూచించింది.

Read More : Norway : బాణాలతో దాడి.. ఐదుగురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం

వెంటనే ఆమె చెప్పినట్టే చేశాడు. తర్వాత…ఆ యువతి అసలు రంగు చూపెట్టింది. ఈ వీడియోను ఫేస్ బుక్ లో పెడుతా..అంటూ బెదిరించడం స్టార్ట్ చేయడం ప్రారంభించింది. ఆ వీడియోను మరికొంతమందికి షేర్ చేసింది. అంతటితో ఆగకుండా..తాను ఆత్మహత్య చేసుకుంటానని..దీనికి నువ్వే కారణమని..భయబ్రాంతులకు గురి చేసింది. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ యువకుడు…పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు.